Jabardasth Comedian Asiya : అమ్మ వాళ్లకి ఇష్టం లేదు… అమ్మ నాన్న కూలీ పని చేస్తారు… డబ్బులు లేక కష్టాలు..: జబర్దస్త్ కమెడియన్ ఆసియా

Jabardasth Comedian Asiya : ఈటీవీ జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన వాళ్ళు ఎందరో అయితే ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉంటూ చిన్న చిన్న వేషాలు వేస్తున్నా మంచి గుర్తింపు అందుకుని కెరీర్ లో ఎదిగినవారు ఉన్నారు. జబర్దస్త్ వల్ల అటు ఆర్థికంగా నిలదొక్కుకోవడమే కాకుండా సినిమాల్లో మంచి అవకాశాలను కూడా అందుకుంటున్నారు చాలా మంది కమెడియన్స్. మొదట పటాస్ షో తో గుర్తింపు తెచ్చుకున్న ఆసియా ఆ తరువాత జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఆసియాతో పాటు నూకరాజు కూడా పటాస్ షో ద్వారానే కెరీర్ మొదలు పెట్టి ఆ తరవాత జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ అంటూ కెరీర్ లో బాగా ఉన్నాడు. ఇక వీరిద్దరి క్యూట్ లవ్ స్టోరీ వారు కెరీర్ లో పడిన కష్టాలను తాజాగా ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

అమ్మ నాన్న కూలీ పని చేస్తారు…

ఆసియా తన వ్యక్తిగత జీవితం గురించి యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను తన వ్యక్తిగత జీవితం గురించి ఎక్కువగా మాటాడనని ఆ విషయాలు చెబితే ఎమోషనల్ అవుతాను అంటూ తెల్పింది. బి టెక్ చదువుతున్న సమయంలో టీవీ రంగలోకి రావాలనే ఆలోచనతో పటాస్ ఆడిషన్స్ కి వెళ్ళడానికి ప్రయత్నించిగా వెళ్లలేకపోయనంటూ చెప్పింది. తన కుటుంబం గురించి చెబుతూ అమ్మ నాన్న కూలీ పనికి వెళ్లి నన్ను చదివించారు అంటూ మంచి ఉద్యోగం చేయాలన్నది వారి ఉద్దేశం, కనీ నాకు నటన వైపు రావాలని ఉండటంతో ఇటు వచ్చానని ఆసియా తన వ్యక్తిగత జీవితం గురించి తెలిపింది. ఇక పటాస్ షో లో మొదట ప్రేక్షకులలో ఒకరిగా వెళ్లిన ఆసియా ఆ తరువాత మళ్ళీ ఆడిషన్స్ లో సెలెక్ట్ అయి పటాస్ షోలో అలరించింది.

అయితే తన కాలేజ్ స్టూడియోకి చాలా దూరంగా ఉండటం వల్ల ఇబ్బంది పడ్డానంటూ చెప్పిన ఆసియా పటాస్ షో తరువాత రెండేళ్లు ఖాళీగా ఉండాల్సి రావడంతో ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డానంటూ ఎమోషనల్ అయింది. ఇంట్లో వాళ్ళను కష్టపడి ఒప్పించుకోవడం వల్ల ఇప్పుడు అవకాశాలు లేవు అని చెబితే బాధపడతారని ఇంట్లో వాళ్ళకి ఏదో ఒక షో చేస్తున్నాని చెప్పి మేనేజ్ చేసేదాన్నని, డబ్బులకు ఇబ్బంది పడిన రోజులు చాలానే ఉన్నాయంటూ కానీ అవన్నీ భరించి కెరీర్ లో నిలదొక్కుకున్నాను, ప్రస్తుతం జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ లలో చేస్తూ అలానే యూట్యూబ్ ఛానెల్ ద్వారా బాగానే కెరీర్ నడుస్తోందని తన కెరీర్ వ్యక్తిగత విషయాలను తెలిపింది ఆసియా.