Analyst Adusumilli Srinivasarao : టీడీపీకి సపోర్ట్ గా జూనియర్ ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారనికి రాకుండా అడ్డుకునేది ఎవరు?? తారక్ అవసరం చంద్రబాబుకి ఉందా?? అనలిస్ట్ అడుసుమిల్లి శ్రీనివాసరావు

Analyst Adusumilli Srinivasarao : ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో ఎన్నికలకు ఇంకో సంవత్సరం సమయం ఉంది అయితే అప్పుడే ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమవుతూ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. పొత్తులు, పర్యటనలు అంటూ బిజీ అయిపోయారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవల ఖమ్మం సభలో మాట్లాడటం, అక్కడికి జనం బాగా రావడంతో తెలంగాణలో కూడా టీడీపీకి ఇంకా బలం ఉందనే విషయం అన్ని పార్టీలకు అర్థమైంది. అయితే ఈ సారి ఎన్నికల్లో ఏపీలో ఏ పార్టీ వైపు ప్రజలు ఉన్నారో తెలియదు కానీ మూడు ప్రాంతీయ పార్టీలలో ఎవరి బలం ఎంతో ప్రజలే నిర్ణయిస్తారు. అయితే టీడీపీ తరుపున ప్రచారం చేయడానికి తన తమ్ముడు ఎన్టీఆర్ వస్తాడంటూ ఇటీవల తారక రత్న చేసిన వ్వాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చకు దారితీసాయి. ఇక ఎన్టీఆర్ నిజంగా ప్రచారానికి వచ్చే అవకాశం ఉందా లేదా అనే అంశం మీద పొలిటికల్ అనలిస్ట్ అడుసుమిల్లి శ్రీనివాసరావు గారు విశ్లేషించారు.

ఎన్టీఆర్ అవసరం టీడీపీ కి ఉందా…

శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ టీడీపీ రెండు రాష్ట్రాల్లోను ప్రస్తుత పరిస్థితుల్లో అవసరం అని ప్రజలు భావిస్తున్నారంటూ అభిప్రాయపడ్డారు. అటు ఏపీ లో ప్రభుత్వ వ్యతిరేకత టీడీపీ కి కలిసి రావొచ్చు. ఇక్కడ తెలంగాణ లోనూ టీడీపీ ఇంకా బ్రతికే ఉందని మొన్న ఖమ్మం సభ నిరూపించింది. ఇప్పుడు ఏపీ ఎన్నికల్లో గెలవాలని అన్ని పార్టీలూ సమాయత్తమవుతుండగా పొత్తుల గురించి చర్చలు నడుస్తున్నాయి. ఈసారి టీడీపీ వైపు ప్రజలు ఉంటే ఎవరు టీడీపీ తో కలిసి వచ్చినా రాకపోయినా ఆ పార్టీ గెలుస్తుంది.

ఇక టీడీపీకి ఎన్టీఆర్ గారి ప్రచారం అవసరమని నేను అనుకోవడం లేదు అంటూ శ్రీనివాసరావు గారు అభిప్రాయపడ్డారు. కాకపోతే చంద్రబాబు ఏ ఒక్క ఛాన్స్ వదలకూడదు అనుకుంటే ఎన్టీఆర్ ను ప్రచారానికి పిలవొచ్చు. ఒకవేళ పిలిచినా ఎన్టీఆర్ వచ్చి ప్రచారం చేస్తాడు. అది వాళ్ళ కుటుంబానికి సంబంధిచిన పార్టీ కనుక బాధ్యత ఎన్టీఆర్ కు ఉంది అంటూ అభిప్రాయపడ్డారు. అయితే బీజేపీ పార్టీ ఎన్టీఆర్ ను వచ్చే ఎన్నికలకు వినియోగించుకోవాలని అనుకుంటోంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. అమిత్ షా తో ఎన్టీఆర్ భేటీ అందుకే జరిగిందని భావిస్తున్నారు కానీ అన్నీ ఊహగానాలే కానీ ఇంకా స్పష్టత రావాలి అంటూ తెలిపారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

5 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago