Categories: FeaturedMovie News

Senior journalist Imandhi Ramarao : కైకాల సత్యనారాయణ గారి ఆస్తుల గురించిన షాకింగ్ విషయాలను బయటపెట్టిన సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు…!

Senior Journalist Imandhi Ramarao : నవరస నట సార్వభౌముడిగా తాను పోషించిన ఏ పాత్రలోనైనా ఒదిగి పోయి హీరో అయినా విలన్ అయినా కరుణ రసమైనా రౌద్రమైనా హాస్యమైనా ఇలా ఏదైనా సరే అవలీలగా పోషించిన నటులు కైకాల సత్యనారాయణ గారు. ఆయన శుక్రవారం తెల్లవారుజామున ఆయన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. ఆయన పుట్టింది కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామంలో 1935 జులై 25న జన్మించిన కైకాల గారు గుడివాడ కాలేజీలో గ్రాడ్యూయేషన్‌ పూర్తి చేశారు. చిన్నప్పటినుంచి నటనపై ఉన్న ఆసక్తితో విద్యార్థి దశలోనే ఎన్నో నాటకాలు, స్టేజ్ ప్రదర్శనలు ఇచ్చారు. ఆయన ప్రతిభ ను ప్రముఖ నిర్మాత డీఎల్‌ నారాయణ గుర్తించారు. దాంతో ‘సిపాయి కూతురు’ సినిమాలో కైకాలకు మొదట అవకాశం ఇచ్చారు. 61 సంవ‌త్స‌రాల పాటు సినిమా రంగంలో ఉన్న సత్యనారాయణ గారు దాదాపుగా 780 చిత్రాల్లో నటించారు. ఇక ఆయన నటప్రస్థానంలో సంపాదించిన ఆస్తుల గురించి సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు మాట్లాడారు.

సినిమా నిర్మాణంలో నష్టాలను చూసిన సత్యనారాయణ…

కైకాల సత్యనారాయణ గారు కొన్నివందల సినిమాల్లో నటించారు. మొదట్లో చిన్న చిన్న పాత్రలు చేసిన ఆయన విఠలాచార్య గారి ప్రోత్సాహంతో విలన్ గా నటించి ఆయన కెరీర్ లో కొత్త మార్గంలో పయనించారు. ఒకవైపు విలన్ గా నటిస్తూనే మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను నటిస్తూ అన్ని రకాల పాత్రలు తాను చేయగలనని నిరూపించుకున్న ఆయన దాదాపు అన్ని భాషలలోనూ బిజీ ఆర్టిస్ట్ అయ్యారు. హిందీలో కూడా సినిమా అవకాశాలను అందుకున్న ఆయన తెలుగులోనే చాలా బిజీగా ఉండటం వల్ల కొన్ని అవకాశాలను వదులుకున్నారు అంటూ కైకాల గారి కెరీర్ గురించి సీనియర్ సినిమా జర్నలిస్ట్ ఇమంది గారు మాట్లాడారు. ఇక ఆయన సంపాదించిన దాని గురించి మాట్లాడుతూ మూసగా ఒకేలాంటి పాత్రలు చేయకపోవడం వల్ల ఆయన ఎన్నో సినిమాలలో నటించే అవకాశం అందుకున్నారు.

అలా చెన్నై, హైదరాబాద్ లలో కోట్ల ఆస్తులను సంపాదించుకున్నారు అంటూ ఇమంది గారు తెలిపారు. అయితే ఒకానొక సందర్భలో సినిమా నిర్మాణంలో అడుగుపెట్టిన ఆయన రమా పప్రొడక్షన్ బ్యానర్ మీద ఇద్దరు దొంగలు, కోదమ సింహం, బంగారు కుటుంబం, ముద్దుల మొగుడు వంటి సినిమాలను నిర్మించిన అందులో కొన్ని మంచి హిట్లు అయినా కొన్ని ఫ్లాప్ అవడం, లక్షలు కోల్పోవడంతో నష్టాలను చూసారు. అలా ఇక చిత్ర నిర్మాణం వద్దనుకుని వదిలేసారు. అయితే తన నలుగురు పిల్లలను బాగా సెటిల్ చేసారు సత్యనారాయణ గారు అంటూ ఆయన గురించి ఆసక్తికర విషయాలను ఇమంది గారు తెలిపారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

5 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago