Categories: FeaturedMovie News

Senior Journalist Bhardwaja : ఎన్టీఆర్, కృష్ణ కు మధ్య గొడవలు జరిగినపుడు కైకాల సత్యనారాయణ ఏం చేసారంటే… చంద్రబాబు బాబు విషయంలో కైకాలకు అందుకే కోపం : సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ

Senior Journalist Bhardwaja : ‘సిపాయి కూతురు’ సినిమా ద్వారా సినిమా రంగ ప్రవేశం చేసిన కైకాల గారు దాదాపుగా 700 పైగా సినిమాల్లో నటించారు. అందులోనూ అన్ని రకాల పాత్రలు చేసిన ఆయన నవ నటరస సార్వభౌమ బిరుదును అందుకున్నారు. నాటకాల రంగం నుండి వచ్చిన అయన ఎస్వి రంగారావు గారి తరువాత అన్ని పాత్రాల్లోనూ ఒదిగి పోయి ఆయనను గుర్తుచేసిన నటుడు. నిర్మాతగాను కొన్ని సినిమాలను నిర్మించిన కైకాల గారు 1935 లో కృష్ణ జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామంలో జన్మించారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. డిసెంబర్ 23 శుక్రవారం తెల్లవారు జమున మరణించారు. గతేడాది కరోనా తరువాత ఆయన ఆరోగ్యం కుంటుపడిందంటూ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటం, శీతకాలం కావడంతో కైకాల గారి ఆరోగ్యం క్షిణించి తుదిశ్వాస విడిచారు. ఇక ఆయన జీవిత ప్రస్థానం గురించి సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు మాట్లాడారు.

ఎన్టీఆర్, కృష్ణ నడుమ కైకాల… చంద్రబాబు అంటే అందుకే నచ్చదు…

కైకాల గారు హీరోగాను, విలన్ గాను అలానే సహాయక పాత్రల్లోను ఇలా అన్ని రకాల పాత్రలు చేసిన ఆయన ఆల్ రౌండర్ అనిపించుకున్నారు. ఇక ఎన్టీఆర్ కు కైకాల గారి పర్సనాలిటి కనుముక్కు తీరు దగ్గర ఉండటం వల్ల చాలా సినిమాల్లో ఆయనకు డూప్ గా కైకాల పనిచేసారు. అలా దాదాపు ఎన్టీఆర్ గారితో కలిసి 101 సినిమాల్లో నటించారంటూ భరద్వాజ గారు తెలిపారు. ఇక ఎన్టీఆర్, కృష్ణ మధ్య ఒకానొక సమయంలో రెండు శిబిరాలు నడిచి ఇండస్ట్రీ రెండుగా చీలిన సమయంలో కృష్ణ గారు ‘కురుక్షేత్రం’ సినిమా ఎన్టీఆర్ ‘దాన వీర శూర కర్ణ’ సినిమా తీసారు. అయితే కైకాల గారు ఆ రెండు సినిమాల్లోను నటించడం విశేషం. అటు కృష్ణ గారి కురుక్షేత్రం లో దూర్యోధనుడిగా నటించిన ఆయన ఇటు ఎన్టీఆర్ సినిమా డివిఎస్ కర్ణ లో భీముడు పాత్రలో కనిపించారు.

అలా అందరితోనూ సాయోధ్యగా ఉండటం ఆయనకే చెల్లింది. రామారావు గారితో సన్నిహితంగా ఉండే కైకాల గారు ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టాక అందులో చేరి ఎంపీ గా మచిలీపట్నం నుండి పోటీ చేసి గెలిచారు. ఎన్టీఆర్ గారు కైకాల గారికి మధ్య ఎంతటి సన్నిహిత్యం ఉందంటే పార్టీ పెట్టాలని ఆలోచించినపుడు కూడా కైకాల గారి సలహా ఎన్టీఆర్ తీసుకున్నారట. అయితే ఎంపీ గా పనిచేసిన కైకాల గారికి రాను రాను పార్టీలో ప్రాధాన్యత తగ్గిందని, చంద్రబాబు నాయుడు గారు కైకల గారిని రాజ్యసభకు పంపలేదని కోపంతో పార్టీ కి వారికి దూరంగా ఇన్నేళ్లు ఉన్నారంటూ భరద్వాజ గారు ఆయన గురించిన వివరాలను తెలిపారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

5 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago