Janardhan Rao : నాతో కలిసి పని చేసిన ఐరన్ లెగ్ శాస్త్రి ఆర్థికంగా చితికి పోయాడు… గుండు హనుమంతరావు మరణానికి కారణం అదే…: జనార్దన్ రావు

Janardhan Rao : తెలుగు సినిమాల్లో కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించిన పొలాప్రగఢ జనార్దన్ రావు గారు తన సినిమా విశేషాలను ఇటీవల ఇంటర్వ్యూలో పంచుకున్నారు. జెన్నీ గా బాగా ప్రచుర్యం పొందిన ఈయన సినిమాలే కాకుండా పలు సీరియల్స్ లో కూడా నటించారు. ఇక తనతో పాటు కమెడియన్స్ గా ఎదిగిన ఏవిఎస్, సుత్తి వేలు, బ్రహ్మానందం, బాబు మోహన్, గుండు హనుమంతరావు, ఐరన్ లెగ్ శాస్త్రి, తనికెళ్ళ భరణి వంటి వారి గురించి ఆయన జ్ఞాపకాలను పంచుకున్నారు.

ఐరన్ లెగ్ శాస్త్రి అమాయకుడు…

సినిమాల్లో నటించేటపుడు తోటి నటినటులతో పరిచయం స్నేహం మామూలే. ఇక అప్పటి సీనియర్ నటులైన బ్రహ్మానందం, సుత్తివేలు, ఐరన్ లెగ్ శాస్త్రి వంటి వారితో మంచి అనుబంధం ఉన్న జెన్నీ గారు ఐరన్ లెగ్ శాస్త్రి, గుండు హనుమంత రావు, సుత్తివేలు వంటి వారు మరణించడం వల్ల చాలా బాధపడ్డారట. మనతో పాటు ఉన్న వాళ్ళు ఆర్థికంగా బాగోలేకపోయినా, అనారోగ్యం పాలైనా చాలా బాధగా ఉంటుంది. వారికి అవకాశాలు ఇప్పించాగలిగేంత స్థాయి లేక అలాగే వాళ్ళ అనారోగ్యాన్ని తగ్గించగలిగేంత శక్తి మనకు ఉండదు అది ఇంకా బాధ కలిగిస్తుంది అంటూ చెప్పారు.

ఐరన్ లెగ్ శాస్త్రి విషయంలో అతను చివరి రోజుల్లో తన సొంతూరు వెళ్ళిపోయాడు. అక్కడే అనారోగ్యంతో మరణించడం వల్ల ఇండస్ట్రీకి దూరమవ్వడం వల్ల ఎవరికీ తన గురించి పెద్దగా తెలియలేదు. పంతులుగా ఉన్న ఐరన్ లెగ్ శాస్త్రి అకస్మాత్తుగా వచ్చిన సినిమా అవకాశం వల్ల స్టార్ అయ్యాడు. కానీ ఆ స్టార్ డమ్ ను నిలబెట్టుకోవడం తనకు తెలియలేదు. చాలా అమాయకుడు, ఎపుడూ ఇలానే అవకాశాలు ఉంటాయని నమ్మాడు, ఆర్థికంగా డబ్బు పొదుపు చేసుకోలేదు అందుకే చివరి రోజుల్లో ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలతో మరణించాడు అంటూ ఐరన్ లెగ్ శాస్త్రి గారిని తలుచుకున్నారు. ఇక గుండు హనుమంతరావు గారి గురించి మాట్లాడుతూ ఆయన ఆర్థికంగా బాగున్నారు. అయితే కిడ్నీ సమస్య రావడం వల్ల వారంలో రెండు సార్లు డైయాలసిస్ చేయాల్సి వచ్చేది. అలా అనారోగ్య సమస్యలతో మరణించాడు అంటూ చెప్పారు.