Kadapa: కడపలో అవినాష్ విజయం పక్కా… షర్మిల కు పూర్తిగా చెక్ పెట్టినట్టేనా?

Kadapa: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు పూర్తి అయిన తర్వాత ఎన్నికల ఫలితాలు పూర్తిగా వైసీపీకి అనుకూలంగా మారాయని తెలుస్తుంది. అన్ని ప్రాంతాలలో చూపించబోతుందని ఇప్పటికే పలు సర్వేలు కూడా వెల్లడించాయి అయితే కడపలో కూడా ఎవరు గెలుస్తారనే విషయంపై కూడా అందరి ఆసక్తి నెలకొంది.

పులివెందుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలబడగా కడప ఎంపీగా అవినాష్ వైసీపీ పార్టీ నుంచి ఎన్నికలలో పోటీ చేశారు ఇక వైయస్ వారసురాలు షర్మిల వైయస్ జగన్మోహన్ రెడ్డికి అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నుంచి కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన సంగతి తెలిసిందే.

వివేకానంద రెడ్డి హత్య కేసును అడ్డుగా పెట్టుకొని వైయస్ షర్మిల సునీత రెడ్డి పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు చేశారు.అయితే వీరి ప్రచారాలకు పెద్దగా ఫలితం లేదని తెలుస్తోంది. ఎందుకంటే గత ఐదు సంవత్సరాల కాలంగా కడపలో జరిగినటువంటి అభివృద్ధి అవినాష్ కి మరోసారి పట్టం కట్టబోతోంది.

షర్మిలకు షాక్ తప్పదా…
ఇప్పటికే కడప ఎంపీ స్థానంపై పలు సర్వేలు కూడా అవినాష్ కి అనుకూలంగానే వచ్చాయని చెప్పాలి ఇలా అవినాష్ చేతిలో షర్మిలకు ఘోర పరాజయం తప్పదనే తెలుస్తుంది. ఈ ఓటమితో షర్మిల రాజకీయ జీవితానికి కూడా చెక్ పడబోతోందని స్పష్టంగా తెలుస్తోంది. ఇక అవినాష్ కి జగన్మోహన్ రెడ్డి మద్దతు కూడా పూర్తిగా ఉండడంతో ప్రజలందరూ కూడా వైఎస్ జగన్ కే సానుకూలంగా ఉన్నారని తమ ఓటుతో షర్మిలకు గట్టి సమాధానం ఇవ్వబోతున్నారని తెలుస్తోంది.