Kajal Aggarwal: తన కొడుకు నీల్ పేరుకు అర్థం చెప్పిన కాజల్… అందుకే పెట్టామంటూ?

Kajal Aggarwal:వెండితెర చందమామ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా కాజల్ అగర్వాల్ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉండడమే కాకుండా మరోవైపు తన కుటుంబ బాధ్యతలను కూడా ఎంతో చక్కగా నిర్వర్తిస్తున్నారు.

ప్రస్తుతం వరుస సినిమా షూటింగులతో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె సోషల్ మీడియా వేదికగా కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు. అంతేకాకుండా తన కుమారుడు నీల్ గురించి కూడా ఎన్నో విషయాలను తెలియచేస్తూ ఉంటారు. అయితే తాజాగా తన కుమారుడికి ఆ పేరు పెట్టడానికి గల కారణం ఏంటనే విషయాన్ని తెలియజేశారు.

కాజల్ అగర్వాల్ తనకు కుమారుడు పుట్టడంతో వెంటనే తన పేరు నీల్ అని ప్రకటించారు. అయితే తనకు ఆ పేరు పెట్టడానికి కారణం తనకు శివుడు అంటే చాలా ఇష్టమైన దేవుడని తెలిపారు.అందుకే ఆ నీలకంఠేశ్వరుడి పేరు కలసి వచ్చేలా తన కుమారుడికి నీల్ అని పెట్టినట్లు కాజల్ తెలిపారు.

Kajal Aggarwal: శివుడి పేరుకు ప్రతీకగా..


ఇలా చిన్న పేరు పెడితే అందరికీ రాయడానికి పలకడానికి చాలా సులభంగా ఉంటుందన్న ఉద్దేశంతోనే తాను శివుడు పేరు కలిసి వచ్చేలా తన కుమారుడికి పేరు పెట్టినట్లు తెలిపారు.ఈ విధంగా ఈమె తన కుమారుడి పేరు వెనుక ఉన్నటువంటి ఈ రహస్యాన్ని తెలియజేస్తూ చేస్తున్నటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.