Kajal Aggarwal:వెండితెర చందమామ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా కాజల్ అగర్వాల్ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉండడమే కాకుండా మరోవైపు తన కుటుంబ బాధ్యతలను కూడా ఎంతో చక్కగా నిర్వర్తిస్తున్నారు.
ప్రస్తుతం వరుస సినిమా షూటింగులతో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె సోషల్ మీడియా వేదికగా కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు. అంతేకాకుండా తన కుమారుడు నీల్ గురించి కూడా ఎన్నో విషయాలను తెలియచేస్తూ ఉంటారు. అయితే తాజాగా తన కుమారుడికి ఆ పేరు పెట్టడానికి గల కారణం ఏంటనే విషయాన్ని తెలియజేశారు.
కాజల్ అగర్వాల్ తనకు కుమారుడు పుట్టడంతో వెంటనే తన పేరు నీల్ అని ప్రకటించారు. అయితే తనకు ఆ పేరు పెట్టడానికి కారణం తనకు శివుడు అంటే చాలా ఇష్టమైన దేవుడని తెలిపారు.అందుకే ఆ నీలకంఠేశ్వరుడి పేరు కలసి వచ్చేలా తన కుమారుడికి నీల్ అని పెట్టినట్లు కాజల్ తెలిపారు.
ఇలా చిన్న పేరు పెడితే అందరికీ రాయడానికి పలకడానికి చాలా సులభంగా ఉంటుందన్న ఉద్దేశంతోనే తాను శివుడు పేరు కలిసి వచ్చేలా తన కుమారుడికి పేరు పెట్టినట్లు తెలిపారు.ఈ విధంగా ఈమె తన కుమారుడి పేరు వెనుక ఉన్నటువంటి ఈ రహస్యాన్ని తెలియజేస్తూ చేస్తున్నటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…