Kakinaada Shyamala : చేసిన పాపం ఊరికే పోదు, దేవుడు చూసుకుంటాడు వాళ్ళను…: కాకినాడ శ్యామల

Kakinaada Shyamala : కాకినాడ నుండి రావడం మూలంగా కాకినాడ శ్యామల గా బాగా పేరు తెచ్చుకున్న నటి శ్యామల గారు మొదట నాటకరంగంలో ప్రవేశించారు. చిన్నతనం నుండి సింగర్ కావాలని అనుకున్న శ్యామల అనూహ్యంగా నాటకరంగంలోకి వచ్చి చింతామణి, ప్రమీల వంటి నాటకాలతో మంచి గుర్తింవు తెచ్చుకుంది. ఇక అలా సినిమా రంగంలోకి అడుగుపెట్టిన శ్యామల మొదట బాలచందర్ గారి ‘మరో చరిత్ర’ సినిమాలో తల్లి పాత్ర పోషించారు. ఇక ఆ తరువాత ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, తరంగిణి ఇలా సుమారు 200 కు పైగా సినిమాల్లో నటించిన ఆమె 90లలో నటనకు గుడ్ బై చెప్పి వెండి తెర, బుల్లితెరకు దూరంగా ఉన్నారు. తాజాగా ఒక యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కనిపించిన శ్యామల గారు తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను గురించి వివరించారు.

చేసిన పాపం ఊరికే పోదు…

శ్యామల గారు తన చిన్నత్తనంలోనే తండ్రిని కోల్పోవడం వల్ల తల్లి అన్నీ తానై పెంచింది. అలా సినిమాల్లోకి వచ్చి డబ్బు సంపాదించడం. మొదలు పెట్టిన శ్యామల గారు బాగా స్థిరపడిన వ్యక్తినే పెళ్లి చేసుకున్నా ఆయన వ్యాసనాలకు అలవాటు పడి ఉన్న 600 ఎకరాల భూమిలో 30 ఎకరాలను మిగిల్చాడు అంటూ చెప్పారు. ఇక ఆ భూమి కోసం కూడా పోరాడాల్సి వచ్చిందని తన భర్త అన్న కొడుకు ఆ భూమిని సాగుచేసుకుంటూ మాకు ఇవ్వలేదని కోర్టు మెట్లెక్కి తిరిగాక చివరికి న్యాయం నా వైపు ఉండటం వల్ల నా భూమి నాకు వచ్చింది అని చెప్పారు.

ఆ భూమిని వేరే వాళ్లకు అమ్మి నేను హైదరాబాద్ లో ఇల్లు కొన్నాను అంటూ చెప్పారు. భూమి కొన్నవాళ్లు కూడా ఇప్పటికీ ఆ భూమిలో ఏమీ చేయలేక పోయారని, మా బావ గారి అబ్బాయి ఇప్పటికీ అక్కడ సాగు చేసుకుంటున్నాడని, దేవుడు అన్నీ చూస్తుంటాడు చేసిన పాపం ఊరికే పోదు అంటూ తెలిపారు. పాపం చేసి కాశీ పోయి గంగలో మునిగినా పుణ్యం రాదు అంటూ ఆవేదన వ్యక్తం చేసారు.