Varalakshmi Sarath Kumar: వరలక్ష్మి శరత్ కుమార్ పరిచయం అవసరం లేని పేరు సీనియర్ నటుడు శరత్ కుమార్ మొదటి భార్య కుమార్తెగా ఈమె ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. కెరియర్ మొదట్లో హీరోయిన్ గా నటించిన పెద్దగా సక్సెస్ కాలేదు. ఈమె బాడీ ఫిజిక్ హీరోయిన్ గా కన్నా విలన్ పాత్రలకే మంచిగా సూట్ అవ్వడంతో ఈమె వరసగా విలన్ పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.
తెలుగులో ఈమె క్రాక్ సినిమా ద్వారా జయమ్మ పాత్రలో నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. దీంతో ఈమెకు వరుసగా తెలుగు అవకాశాలు వచ్చాయి. తాజాగా బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమాలో కూడా విలన్ పాత్రలో నటించి మంచి ఆదరణ సంపాదించుకున్నారు.
ఈ విధంగా వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన కొండ్రల్ పావమ్..అనే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె సినిమా గురించి ఇండస్ట్రీ గురించి పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.ఎంతో కష్టపడి ఒక సినిమాను చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తే సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత కేవలం గంటలోనే ఆ సినిమా గురించి పెద్ద ఎత్తున రివ్యూ రావడం మనం చూస్తున్నాము.
ఈ విధంగా సినిమాలకు ఇచ్చే రివ్యూల గురించి ఈమె మండిపడ్డారు.కేవలం గంటలోనే ఒక సినిమా హిట్టా.. ఫట్టా అనే విషయాన్ని రివ్యూల రూపంలో తెలియజేస్తున్నారు. అయితే పెద్ద హీరోలకు మంచిగా ఇవ్వడమే కాకుండా చిన్న సినిమాలను చిన్న హీరోల విషయంలో కంటెంట్ బాగున్నప్పటికీ చిన్న సినిమాలను తొక్కేస్తున్నారని మండిపడ్డారు. అసలు సినిమాలకు ఇలా రివ్యూలు ఇవ్వడానికి మీరెవరు అంటూ మండిపడ్డారు ఇలా ఈమె తీవ్ర స్థాయిలో నెటిజన్స్ పై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పలువు ఈ విషయంపై స్పందిస్తూ జయమ్మకు ఎక్కడో బాగా మండినట్టు ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…