Chiranjeevi -Kamal Haasan: ఓకే ప్రేమ్ లో కమల్, చిరు.. వైరల్ అవుతున్న త్రో బ్యాక్ ఫోటో!

Chiranjeevi -Kamal Haasan: ఓకే ప్రేమ్ లో కమల్, చిరు.. వైరల్ అవుతున్న త్రో బ్యాక్ ఫోటో!

Chiranjeevi -Kamal Haasan: యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ తాజాగా విక్రమ్ సినిమాతో బాక్సాఫీసు వద్ద అద్భుతమైన హిట్ కొట్టారు. ఈ సినిమాతో చాలా కాలం తర్వాత ఫామ్ లోకి వచ్చిన కమల్ హాసన్ ఈ సినిమా మంచి విజయం కావడంతో పట్టలేని సంతోషం లో ఉన్నారు. ఈ సినిమా ఏకంగా 300 కోట్ల క్లబ్లో చేరడంతో కమల్ హాసన్ చిత్ర బృందానికి పెద్దఎత్తున కానుకలు అందించారు. ఇక ఈ సినిమా మంచి విజయం కావడంతో పెద్ద ఎత్తున విజయోత్సవ కార్యక్రమాలను కూడా నిర్వహించారు.

Chiranjeevi -Kamal Haasan: ఓకే ప్రేమ్ లో కమల్, చిరు.. వైరల్ అవుతున్న త్రో బ్యాక్ ఫోటో!
Chiranjeevi -Kamal Haasan: ఓకే ప్రేమ్ లో కమల్, చిరు.. వైరల్ అవుతున్న త్రో బ్యాక్ ఫోటో!

ఈ సినిమా విజయోత్సవ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న కమల్ హాసన్ ఈ కార్యక్రమం పూర్తి అయిన వెంటనే సరాసరి మెగాస్టార్ చిరంజీవి ఇంటికి డైరెక్టర్ కమల్ , లోకేష్ కనకరాజ్ వీరితో పాటు బాలీవుడ్ స్టార్ సల్మాన్ మెగాస్టార్ ఇంటికి వెళ్లారు.ఈ క్రమంలోనే చిరు విక్రమ్ సినిమా విజయవంతం అయినందుకు డైరెక్టర్ లోకేష్, కమల్ హాసన్ కు అభినందనలు తెలియజేశారు.

Chiranjeevi -Kamal Haasan: ఓకే ప్రేమ్ లో కమల్, చిరు.. వైరల్ అవుతున్న త్రో బ్యాక్ ఫోటో!

ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి ఇంటిలో దిగిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ ఫోటో మాత్రమే కాకుండా గతంలో అంటే సుమారు 36 సంవత్సరాల క్రితం కమల్ హాసన్ చిరంజీవి దిగిన త్రో బ్యాక్ ఫోటో కూడా ప్రస్తుతం వైరల్ అవుతుంది. 36 ఏళ్ల తర్వాత ఈ ఫోటో బయటికి రావడంతో ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది.

అవార్డు వేడుకలో దిగిన ఫోటో…

1986లో క‌మ‌ల్ హాస‌న్.. స్వాతిముత్యం సినిమాకు గానూ బాలీవుడ్ లెజెండ‌రీ యాక్ట‌ర్ రాజ్ క‌పూర్ చేతుల మీదుగా అవార్డు తీసుకుంటున్న సమయంలో చిరంజీవి కూడా కమల్ హాసన్ పక్కన ఉన్నారు.ఈ విధంగా 36 సంవత్సరాల తర్వాత తిరిగి కమల్ హాసన్ తో చిరంజీవి ఫోటో దిగడంతో ప్రస్తుతం ఈ రెండు ఫోటోలు అవుతున్నాయి. ఈ విధంగా ఈ రెండు ఫోటోలను చూసిన అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.