Chiranjeevi -Kamal Haasan: ఓకే ప్రేమ్ లో కమల్, చిరు.. వైరల్ అవుతున్న త్రో బ్యాక్ ఫోటో!
Chiranjeevi -Kamal Haasan: యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ తాజాగా విక్రమ్ సినిమాతో బాక్సాఫీసు వద్ద అద్భుతమైన హిట్ కొట్టారు. ఈ సినిమాతో చాలా కాలం తర్వాత ఫామ్ లోకి వచ్చిన కమల్ హాసన్ ఈ సినిమా మంచి విజయం కావడంతో పట్టలేని సంతోషం లో ఉన్నారు. ఈ సినిమా ఏకంగా 300 కోట్ల క్లబ్లో చేరడంతో కమల్ హాసన్ చిత్ర బృందానికి పెద్దఎత్తున కానుకలు అందించారు. ఇక ఈ సినిమా మంచి విజయం కావడంతో పెద్ద ఎత్తున విజయోత్సవ కార్యక్రమాలను కూడా నిర్వహించారు.
ఈ సినిమా విజయోత్సవ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న కమల్ హాసన్ ఈ కార్యక్రమం పూర్తి అయిన వెంటనే సరాసరి మెగాస్టార్ చిరంజీవి ఇంటికి డైరెక్టర్ కమల్ , లోకేష్ కనకరాజ్ వీరితో పాటు బాలీవుడ్ స్టార్ సల్మాన్ మెగాస్టార్ ఇంటికి వెళ్లారు.ఈ క్రమంలోనే చిరు విక్రమ్ సినిమా విజయవంతం అయినందుకు డైరెక్టర్ లోకేష్, కమల్ హాసన్ కు అభినందనలు తెలియజేశారు.
ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి ఇంటిలో దిగిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ ఫోటో మాత్రమే కాకుండా గతంలో అంటే సుమారు 36 సంవత్సరాల క్రితం కమల్ హాసన్ చిరంజీవి దిగిన త్రో బ్యాక్ ఫోటో కూడా ప్రస్తుతం వైరల్ అవుతుంది. 36 ఏళ్ల తర్వాత ఈ ఫోటో బయటికి రావడంతో ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది.
1986లో కమల్ హాసన్.. స్వాతిముత్యం సినిమాకు గానూ బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ రాజ్ కపూర్ చేతుల మీదుగా అవార్డు తీసుకుంటున్న సమయంలో చిరంజీవి కూడా కమల్ హాసన్ పక్కన ఉన్నారు.ఈ విధంగా 36 సంవత్సరాల తర్వాత తిరిగి కమల్ హాసన్ తో చిరంజీవి ఫోటో దిగడంతో ప్రస్తుతం ఈ రెండు ఫోటోలు అవుతున్నాయి. ఈ విధంగా ఈ రెండు ఫోటోలను చూసిన అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…