Samantha: ఇంస్టాగ్రామ్ ద్వారా కోట్లు సంపాదిస్తున్న సమంత.. నెల సంపాదన ఎన్ని కోట్లో తెలుసా?
Samantha: డబ్బు సంపాదించాలంటే ఎన్నో మార్గాలు ఉంటాయి. అయితే ఒక్కొక్కరు ఒక్కో మార్గంలో పెద్దమొత్తంలో డబ్బు సంపాదిస్తూ ఉంటారు. ఇక సినీ సెలబ్రిటీల విషయానికి వస్తే వీళ్ళు ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు ఎన్నోరకాల బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తూ పెద్దఎత్తున డబ్బును సంపాదిస్తున్నారు. ఇకపోతే సెలబ్రిటీలు వారికి ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకోవడం కోసం సోషల్ మీడియా ద్వారా వారికి సంబంధించిన విషయాలను షేర్ చేస్తూ ఉంటారు.
దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతున్న టువంటి సమంతకు సోషల్ మీడియాలో మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్స్ ఉన్నారు.ఈ క్రమంలోనే ఈమె సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టిన క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటుంది.ఇక సమంత సోషల్ మీడియా వేదికగా నిత్యం తనకు సంబంధించిన ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకోవడమే కాకుండా తన గ్లామరస్ ఫోటోలను సైతం సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ రోజురోజుకు అభిమానులను పెంచుకుంటూ పోతున్నారు.
ఇకపోతే సమంత ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒక పోస్ట్ చేసిన లక్షల్లో డబ్బులు సంపాదిస్తారు.ఈ విధంగా ఇంస్టాగ్రామ్ ద్వారా అధిక మొత్తంలో డబ్బు సంపాదిస్తున్న వారిలో సమంత మొదటి స్థానంలో ఉంది. ఇకపోతే ఈమె పలు బ్రాండ్లకు ప్రమోటర్ గా వ్యవహరిస్తున్నారు.అయితే ఆ బ్రాండ్ కు సంబంధించిన ఒక పోస్ట్ సమంత ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా లక్షల్లో డబ్బు ను సొంతం చేసుకుంటారు.
ఈ విధంగా ఇంస్టాగ్రామ్ ద్వారా ఈమె బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించే బ్రాండ్ కు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ నెలకు సుమారు మూడు కోట్లకు పైగా ఆదాయం పొందుతున్నారని తెలుస్తోంది. ఏదిఏమైనా కేవలం ఇన్స్టాగ్రామ్ ద్వారా మాత్రమే నెలకు 3 కోట్లు అంటే చిన్న విషయం కాదు. సమంత ఒక సినిమా చేస్తే సుమారు నాలుగు కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. ఇలా ఒక వైపు సినిమాలలోనూ మరొక వైపు పలు బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తూ, మరోవైపు వ్యాపార వేత్తగా సమంత భారీ మొత్తంలోనే సంపాదిస్తున్నారని చెప్పాలి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…