Categories: FeaturedMovie News

Actress Amrutha: ‘ఆరుగురు పతివ్రతలు’ సినిమా హీరోయిన్ ఇప్పుడు ఎక్కడ ఉందో.. ఏం చేస్తుందో తెలుసా?

Actress Amrutha: సాధారణంగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సెలబ్రిటీల జీవితాలు ఎప్పుడు ఎలా తారుమారు అవుతాయో ఎవరికీ తెలియదు. ఊహించిన విధంగా కొందరు సెలబ్రిటీలు రాత్రికి రాత్రే స్టార్ డమ్ సంపాదించుకోగా మరి కొందరికి అవకాశాలు తగ్గిపోవడంతో పూర్తిగా ఇండస్ట్రీకి దూరం అవుతూ ఉంటారు. ఈ విధంగా ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే వెండితెరకు కనుమరుగైన హీరోయిన్లలో నటి అమృత ఒకరు.

కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన అమృత ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన ఆరుగురు పతివ్రతలు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు.నిజజీవితంలో ఆరుగురు మహిళల విషయంలో జరిగిన కథను ఆధారంగా ఈవీవీ సత్యనారాయణ ఈ సినిమాను ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. ఇందులో నటి అమృత భర్త ఉండగానే మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్న పాత్రలో కనిపిస్తారు.

ఈ సినిమా మంచి ఆదరణ పొందిందినప్పటికీ ఈ సినిమా బుల్లితెరపై ప్రసారం అవుతూ ప్రేక్షకులను సందడి చేస్తుంది. ఇకపోతే ఈ సినిమా తర్వాత అమృత తెలుగు సినిమాలకు దూరమయ్యారు. బహుశా ఆమె మొదటి సినిమాలో నటించిన తరహాలోనే తదుపరి సినిమాలో పాత్రలు రావడంతో తాను దూరం అయ్యారని తెలుస్తోంది.ఇక ఈమె సినీ కెరీర్లో అన్ని భాషల్లో కలిపి కేవలం పది సినిమాలలో మాత్రమే నటించారు.

గృహిణిగా స్థిరపడిన అమృత..

ఈ విధంగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే వెండితెరకు దూరం అయిన అమృత ప్రస్తుతం ఏం చేస్తుందనే విషయానికి వస్తే… వెండి తెరకు దూరమైన ఈమె వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు. దీంతో పూర్తిగా సినిమాలకు దూరమై పూర్తిగా దాంపత్య జీవితంలో ఉన్నటువంటి అమృత బెంగళూరులో గృహిణిగా స్థిర పడినట్లు తెలుస్తోంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

7 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago