Kantara : కాంతార, రంగస్థలం ఈ రెండు సినిమాల్లో కామన్ పాయింట్ ఇదే..!

Kantara : ప్రస్తుతం సౌత్ ని ఉపేస్తున్న సినిమా ‘కాంతార’. ఎక్కడా చూసిన ఈ సినిమా గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు. అసలు ఏ మాత్రం ప్రచారం లేకుండా వచ్చిన ఈ సినిమా ఇప్పుడు వసూళ్లలో కేజీఎఫ్, ఆర్ఆర్ఆర్ లను మించి పోయింది. ఐఏండిబి రేటింగ్స్ లో కూడా ఈ రెండు సినిమాలను దాటేసింది. కన్నడ చిత్రమైనా ఇతర భాషల్లో కూడా మంచి రెస్పాన్స్ తో పెద్ద సినిమాలను కుడా పక్కకు నెట్టి దూసుకుపోతున్న ఈ సినిమాకు మన రామ్ చరణ్ నటించిన ‘రంగస్థలం’ సినిమాకు కొన్ని కామన్ పాయింట్స్ ఉన్నాయి తెలుసా. కాంతార సినిమాను రిషబ్ శెట్టి తన సొంతూరు లో జరిగిన యధార్థ ఘటనల ఆధారంగా తెరకేక్కించాడు. ఇక ఈసినిమాలో హీరో కూడా రిషబ్ శెట్టి నే, ఆత్మలతో మాట్లాడే వారి తెగ గురించి ప్రపంచానికి ఈ సినిమా ద్వారా పరిచయం చేసాడు రిషబ్ శెట్టి.

రంగస్థలం, కాంతార లో కామన్ అదే…

ఇక రామ్ చరణ్ సుక్కు కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం సినిమా కూడా మంచి హిట్. సినిమా మొత్తము గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కింది. కాంతార సినిమా కూడా గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కింది. ఇక కాంతార సినిమాలో తమ్ముడిని చంపింది దొర వ్యతిరేకులని వారిపై హీరో పగ పెంచుకుంటాడు. ఇది అచ్చం రంగస్థలం లో కూడా చిట్టి బాబు తన అన్న ప్రెసిడెంట్ గా పోటీ చేసాడని, పాత ప్రెసిడెంట్ చంపించాడని పగ పెంచుకుంటాడు. రంగస్థలం లో కూడా ప్రెసిడెంట్ మీద పగ పెంచుకోవడం చూపించి చివరికి తన అన్నను చంపిన మెయిన్ విలన్ అయిన ప్రకాష్ రాజ్ ను చంపడం చూపిస్తారు.

ఇక కాంతార లో అసలు విలన్ దొర అని తెలిసీ హీరో చివరికి దొరను చంపేస్తాడు, సినిమాకు పెద్ద మలుపు అదే ఇది అచ్చం రంగస్థలం సినిమాలో లాగా అనిపిస్తుంది. ఇలా రెండు సినిమాలు ఈ పాయింట్ లో కనెక్ట్ అయ్యాయి. ఇక రెండు సినిమాల్లో కూడా గ్రామీణ వాతావరణం, సంస్కృతి ని బాగా చూపించారు దర్శకులు. కాంతార సినిమాకు ప్రస్తుతం ఎపుడు కలెక్షన్స్ తగ్గుతాయో చెప్పడం ట్రేడ్ వర్గాలకు సైతం అంతు చిక్కడం లేదు. మొత్తానికి మరో పాన్ ఇండియా సినిమా అయిపోయింది కాంతార.