Kantara: డిజిటల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత ప్రతి ఒక్క సినిమా డిజిటల్ మీడియాలో ప్రసారమవుతున్న సంగతి మనకు తెలిసిందే. కొన్ని సినిమాలు థియేటర్ రన్ పూర్తి చేసుకున్న తర్వాత డిజిటల్ మీడియాలో ప్రసారం కాగా మరికొన్ని సినిమాలు నేరుగా ఓటీటీలో ప్రసారమవుతుంటాయి.ఈ క్రమంలోనే తాజాగా కన్నడ నటుడు రిషబ్ శెట్టి హీరోగా ఆయన దర్శకత్వంలో కాంతార సినిమా థియేటర్లో ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.
పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా అన్ని భాషలలోనూ ఎంతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా కాంతార సినిమా పేరు మారుమోగిపోతుంది. ఎంతోమంది సినీ ప్రముఖులు ఈ సినిమాపై పెద్ద ఎత్తున ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.ఇలా థియేటర్లో విడుదలైన ఈ సినిమా ఎంతో మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో త్వరలోనే డిజిటల్ మీడియాలో కూడా ప్రసారం కానుందని తెలుస్తుంది.
ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సమస్థ అమెజాన్ ప్రైమ్ భారీ ధరలకు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఇక ఎంతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమాని డిజిటల్ మీడియాలో చూడటం కోసం ప్రేక్షకులు సైతం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.ఇక ఈ సినిమా నవంబర్ రెండవ వారం లేదా మూడవ వారంలో డిజిటల్ మీడియాలో ప్రసారం కానుందని తెలుస్తోంది.
ఇక ఈ సినిమా తెలుగు హక్కులను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కొనుగోలు చేశారు. రెండు కోట్ల రూపాయలకు అల్లు అరవింద్ కొనుగోలు చేయగా ఏకంగా ఈ సినిమా కోట్ల రూపాయల లాభాలను తెచ్చిపెట్టింది. ఇక ఈ సినిమా కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు బయ్యర్లకు కాంతార సినిమా కాసుల వర్షం కురిపించిందని చెప్పాలి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…