Rajendra Prasad Son : భారతదేశ చలన చిత్ర పరిశ్రమలో ఎంతోమంది వారసత్వం తీసుకొని సినిమాల్లో నటిస్తూ అగ్రతారగా ఎదిగిన వారిని ఎందరినో చూశాం. మన టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎంతోమంది నట వారసులు ఉన్నారు. ఇక అసలు విషయంలోకి వెళితే మన టాలీవుడ్ పరిశ్రమకు మొదటి నుంచి హాస్యనటులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎందరో కమెడియన్స్ తెలుగు ప్రేక్షకులను నవ్వించారు. అయితే కేవలం హాస్య నటుడిగా మాత్రమే కాకుండా సినిమాల్లో హీరోగా కూడా నటించి తన స్టామినా ఏమిటో నిరూపించుకున్న వ్యక్తి రాజేంద్ర ప్రసాద్.
ఈయనకు టాలీవుడ్ ఇండస్ట్రీకి దేవుడిలా భావించే ఎన్టీఆర్ గారికి సంబంధాలు అప్పట్లో బాగా ఉండేవి. దీనికి కారణం సీనియర్ ఎన్టీఆర్ గారికి రాజేంద్ర ప్రసాద్ గారు మంచి కుటుంబ సభ్యుడు అలాగే దగ్గరి బంధువు. అంతేకాదు రాజేంద్ర ప్రసాద్ గారు జన్మించింది సీనియర్ ఎన్టీఆర్ గారి ఇంట్లోనే. ఇకపోతే రాజేంద్రప్రసాద్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కు అలాగే సినీ హీరో గా అవకాశాలు రావు అటువంటి పరిస్థితుల్లో కామెడీ వైపు దృష్టి సారించాలని సలహా ఇచ్చారు. దీంతోనే ఆయన ఎక్కువగా హాస్య భరితమైన సినిమాలు చేయడంలో ముందుండేవారు. దీంతో ఆయన అనేక సినిమాల్లో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో నవ్వించడానికి ప్రయత్నం చేసి సఫలమయ్యారు. ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ వంటి కమెడియన్స్ కుమారులు కూడా హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీలో చేసినవారే. అయితే కొన్ని రోజులు రాజేంద్రప్రసాద్ అటు కమెడియన్ కాకుండా ఇటు హీరో గా కాకుండా తన వయస్సుకు సంబంధించిన పాత్రలు లభించకపోవడంతో కొన్ని రోజులు సినిమాలకు దూరంగా ఉంటూ సమయాన్ని గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇకపోతే అందరి లాగే తన కొడుకుని కూడా సినీ ఇండస్ట్రీకి తీసుకురావాలని రాజేంద్రప్రసాద్ ప్రయత్నించాడు. రాజేంద్ర ప్రసాద్ కొడుకు కూడా అచ్చం తన తండ్రిలాగే చూడటానికి ఉండేవారు. ఆయన పేరు బాలాజీ ప్రసాద్. ఇకపోతే బాలాజీ తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యే సమయంలో రామోజీరావు నిర్మాతగా నిధి ప్రసాద్ దర్శకత్వంలో ఓ చిత్రం ప్రారంభోత్సవం జరిగింది. అయితే కొన్ని కారణాల వల్ల 40 శాతం వరకు పూర్తయిన ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. దీంతో రాజేంద్రప్రసాద్ తో సహా తన కొడుకు కూడా మొదటి సినిమానే ఇలా కావడంతో చాలా డిప్రెషన్ లోకి వెళ్లారు. దీంతో సెంటిమెంట్ గా రాజేంద్ర ప్రసాద్ కొడుకు తనకు సినిమా ఇండస్ట్రీ అచ్చురాదని నిర్ణయించుకున్నాడు. ఇక అప్పటి నుంచి ఇప్పటిదాకా సినిమా ఇండస్ట్రీ వైపు ఆయన చూడలేదు. దీంతో రాజేంద్రప్రసాద్ కాస్త ఆవేదన చెందాడు. అందరూ తమ వారసులను హీరోలుగా చేస్తున్నారని కాకపోతే తాను ఇన్ని చిత్రాలు చేసి, తనకి ఇండస్ట్రీలో అంత పలుకుబడి ఉందని తన కొడుకుని సినిమా హీరోగా పరిచయం చేయలేకపోయానని ఇప్పటికీ ఆయన ఫీల్ అవుతూ ఉంటారు.
మొదటి సినిమా సంగతులు మరిచిపోయి తర్వాత సినిమా మొదలు పెట్టాలని ఎన్నో సార్లు చెప్పినా గాని తన కొడుకు ఆయన మాటలు విన్న లేదని తెలిపారు. దీంతో పెళ్లి అయితే అయినా తన కొడుకు మారుతాడని 2017 లో శివశంకరి అనే అమ్మాయిని ఇంటి కోడలిగా తెచ్చుకున్నారు. కొడుకు వివాహాన్ని చెన్నై నగరంలో జరిగిన రిసెప్షన్ కార్యక్రమాన్ని హైదరాబాద్ మహానగరంలో ఎంతో మంది సినీ నటుల ప్రముఖులు, రాజకీయ నాయకుల మధ్యలో జరిపించారు. తన కొడుకు ఎప్పుడూ నటించాలని కోరుకున్న తాను నిర్మాతలను సెట్ చేస్తానని వీలైతే కానీ నిర్మాతగా మారుతాను అన్నట్లు తెలిపారు. అయితే తన కొడుకు కి సినిమాల్లో నటించిన ఘనత విదేశాలకి ఎక్స్ పోర్ట్ బిజినెస్ మెన్ గా రాణించాలని అనుకుంటున్నట్లు ఆయన తెలియజేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…