Rajamouli : తన మొత్తం సినిమా కెరీర్ లో తీసిన అన్ని సినిమాల్లో ఒక్క సినిమా కూడా ఫ్లాప్ అవ్వకుండా ఉన్న డైరెక్టర్ ఇండియా మొత్తంలో రాజమౌళినే అని అందరూ చెప్పేస్తారు. ఇంత వరకూ ఓటమి ఎరగని దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు జక్కన్న. టాలీవుడ్ లోనే కాదు ఇతర భాషల హీరోలు కూడా ఒక్కసారి జక్కన్న సినిమాలో నటిస్తే చాలు అనుకునేలా జక్కన్న టేకింగ్ ఉంటుంది. అయితే జక్కన్న కెరీర్ లో బాగా చూస్తే ఒక సినిమా మాత్రం ఫ్లాప్ గా నిలిచింది. అయితే అది దర్శకత్వంలో కాదు కానీ నటుడుగా ఫ్లాప్ సినిమా జక్కన్న ఖాతాలో ఉంది.
కోడి రామకృష్ణ, జక్కన్న కలిసి నటించిన చిత్రం… ఫ్లాప్…
ఇద్దరు డైరెక్టర్లు నటులుగా మారి నటించిన సినిమా అసలు ఎపుడు వచ్చిందో ఎపుడు వెళ్లిందో తెలియకుండా వచ్చి వెళ్ళిపోయింది. డైరెక్టర్ విఎన్ ఆదిత్య మనసంతా నువ్వే, నేనున్నాను, లాంటి సినిమాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఆయన డైరెక్షన్ లో వచ్చిన ‘రెయిన్బొ’ సినిమాలో హ్యాపీడేస్ టైసన్, అలాగే సోనాలి చౌహన్ హీరో హీరోయిన్లుగా నటించారు.
ఈ సినిమాలో అతిధి పాత్రలో డైరెక్టర్ కోడి రామకృష్ణ అలాగే రాజమౌళి ఒక సన్నివేశం లో కనిపిస్తారు. కానీ సినిమా మాత్రం ఫ్లాప్ అయింది. అసలు ఎపుడు వచ్చిందో పాయిందో కూడా చాలా మంకదికి తెలియదు. అలా ఒక ఫ్లాప్ సినిమాలో నటించి రాజమౌళి తన ఖాతాలో ఫ్లాప్ ను వేడుకున్నాడన్న మాట.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…