Allu Sirish: టాలీవుడ్ ఇండస్ట్రీలో అల్లు ఫ్యామిలీకి ఎలాంటి క్రేజ్ ఉందో మనకు తెలిసిందే. అల్లు రామలింగయ్య వారసుడిగా అల్లు అరవింద్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.నిర్మాతగా అల్లు అరవింద్ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోగా ఈయన వారసులుగా అల్లు బాబి నిర్మాతగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉండగా అల్లు అర్జున్ అల్లు శిరీష్ ఇండస్ట్రీలో హీరోలుగా కొనసాగుతున్నారు.
అల్లు అర్జున్ పాన్ ఇండియా స్థాయిలో హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకోగా అల్లు శిరీష్ మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీలోనే సరైన గుర్తింపు సంపాదించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే అల్లు శిరీష్ తాజాగా ఊర్వశివో రాక్షసివో అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా నవంబర్ 4వ తేదీ విడుదల కానుంది.
అల్లు శిరీష్ అను ఇమ్మానుయేల్ జంటగా నటించిన ఈ సినిమా నవంబర్ 4 న విడుదల కావడంతో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోని ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి అల్లు శిరీష్ సినిమా గురించి, ఇందులో హీరోయిన్ తో తన ప్రేమయానం గురించి చెప్పుకొచ్చారు.ఈ క్రమంలోనే యాంకర్ నిజజీవితంలో కూడా ఎవరితో అయినా రిలేషన్ లో ఉన్నారా అంటూ ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు అల్లు శిరీష సమాధానం చెబుతూ ప్రస్తుత కాలంలో రిలేషన్ లో లేకుండా ఉండేవాళ్ళు ఎవరున్నారు అంటూ సమాధానం చెప్పారు. ఇక తాను కూడా రిలేషన్ లో ఉన్నానని, మూడుసార్లు సీరియస్ గా రిలేషన్ లో ఉండి బ్రేకప్ చెప్పుకున్నానని ఈ సందర్భంగా తన రిలేషన్స్ గురించి బ్రేకప్ గురించి శిరీష్ ఓపెన్ అయ్యారు
కొన్ని కారణాల వల్ల తాను మూడుసార్లు బ్రేకప్ చెప్పుకోవాల్సి వచ్చిందని అయితే బ్రేకప్ చెప్పేటప్పుడు ఆ బాధ తెలియకపోయినా ఒక ఏడాది తర్వాత అసలు ఎందుకు బ్రేకప్ చెప్పానా అనే బాధ తనని ఎంతగానో వెంటాడిందని అల్లు శిరీష్ తెలిపారు. బ్రేకప్ చెప్పిన తర్వాత తాను ఎంతో బాధపడ్డానని,లేకపోతే ఈపాటికి తాను కూడా పెళ్లి చేసుకునే వాడినంటూ ఈయన చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…