Karna’s son Vrishasena : చరిత్రలో చెప్పని వీరుడు… కర్ణుడి కొడుకుని ఎందుకు చంపారు… ఎవరు చంపారు…!

Karna’s son Vrishasena : మహాభారతం హిందూ ఇతిహాసాల్లో ఒకటి. ఎన్నిసార్లు విన్నా చదివినా, చదివిన ప్రతిసారి కొత్త విషయాలను చెప్పే గ్రంధం మహాభారతం. ఇక మన ఇండియాలో వచ్చే చాలా సినిమాలకు ఇప్పటికీ మూలం మహాభారతం. అందులోని ప్రతి పాత్ర మనకు ధర్మానికి, అధర్మానికి ఉన్న ప్రముఖ్యతను స్నేహానికి వర్ణన అన్నీ నేర్పుతాయి. మహాభారతం మనకు భగవద్గీతను ఇచ్చింది. ఇక కురుక్షేత్ర సంగ్రామం ఎన్నోలక్షల మంది పాల్గొన్న అతి పెద్ద యుద్ధం. ఇక ఆ యుద్ధంలో ఎంతో మంది వీరులు, ఇండియాలోని దాదాపు అన్ని రాజ్యాలు పాల్గొన్నాయి. అలాంటి యుద్ధంలో వీరోచితంగా పోరాడిన ఒక యోధుడి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

కర్ణుడి కొడుకు వృషసేనుడు… పాండవులను భయపెట్టిన వీరుడు…

మహాభారతంలో వీరులలో ఒకరు కర్ణుడు. అధర్మం వైపు నిలబడినా ధర్మానికి, త్యాగానికి నెలవెత్తు రూపం కర్ణుడు. స్నేహం కోసం స్నేహితుడికిచ్చిన మాట కోసం సోదరులతో పోరాడిన వీరుడు. అలాంటి వీరుడి మొదటి కొడుకే వృషసేనుడు. వృషసేనుడు, కర్ణుడు ఇద్దరూ కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్నారు. వృషసేనుడు పాండవుల తరుపున పాల్గొన్న చాలా మంది వీరులను హతమార్చాడు. ఇక ఉప పాండవులను, దృపదుడిని ఓడించాడు. ఇక సహదేవుడి మీద విరుచుకుపడి హడలెత్తించాడు.

సహదేవుడి బాణం, ఖడ్గం అన్నింటిణి విరిచేసాడు. ఇక భయపడిన సహదేవుడు భీముడి వద్దకు వెళ్లగా భీముడిని తన బాణాలతో హడాలెత్తిచ్చిన వృషసేనుడు అర్జునుడిని, శ్రీ కృష్ణుడిని సైతం గాయపరిచాడు. అలా చెలరేగి హడలెత్తిస్తున్న వృషసేనుడిని చూసి ఆవేశంతో అర్జునుడు వరుసగా పది బాణాలను వదిలాడు. అలా వదిలగానే వృషసేనుడి తల భుజాలు వేరయిపోయి నేలకు రాలాడు. అలా పాండవులను భయపెట్టి వీరోచిత పోరాటం చేసిన కర్ణుడి ప్రథమ కుమారుడు వృషసేనుడు వీరుడిలా యుద్ధభూమిలో మరణించాడు.