Categories: FeaturedMovie News

Makeup Man Madhavarao : మహేష్ బాబు విగ్గు నిజమేనా?? కృష్ణ గారికి విగ్గు పెట్టడం వల్ల జుట్టు పోయింది.. : మేకప్ మెన్ మాధవరావ్

Krishna Makeupman Madhavarao : సూపర్ స్టార్ కృష్ణ గారి మేకప్ మాన్ గా కొన్నేళ్లుగా పనిచేస్తున్న మాధవరావుగారు కృష్ణ గారు మరణించాక ఆయనతో ఉన్న అనుబంధాన్ని, స్మృతులను పలు ఇంటర్వ్యూల్లో పంచుకుంటున్నారు. కృష్ణ గారి చివరి సినిమా ‘శ్రీ శ్రీ’ వరకు కూడా మాధవరావు గారే మేకప్ వేశారు. ఇక కృష్ణ గారు మరణించాక ఆయన పార్థివ దేహాన్ని కూడా తుడిచి ఆయనే సిద్ధం చేశారట. అంత్యక్రియల సమయంలో కూడా ఆయనే స్నానం చేయించి బొట్టు పెట్టి చేసానని ఆయన నన్ను మేకప్ మాన్ గా కంటే ఒక సోదరుడిలాగా, స్నేహితుడిలాగ చూసారంటూ కృష్ణ గారి గురించి మాట్లాడారు మాధవరావు గారు. ఇక అప్పట్లో మేకప్ ఎలా ఉండేది బ్లాక్ అండ్ వైట్ కి కలర్ సినిమాలకు మేకప్ లో తేడాలేమిటి లాంటి విషయాలను మాధవరావు గారు పంచుకున్నారు.

జుట్టున్నా విగ్ పెట్టేవారు.. మహేష్ కు విగ్…

అసాధ్యుడు సినిమాలో మొదటి సారిగా కృష్ణ గారికి విగ్ పెట్టినట్లు మాధవరావు గారు తెలిపారు. అప్పుడు ఆయనకు జుట్టు ఉన్నా సినిమాలో హీరో పాత్రకు డిఫరెంట్ హెయిర్ స్టైల్ ఉండాలని పెట్టేవారు. అలా అసాధ్యుడు సినిమాకి పెట్టినా సహజంగా కృష్ణ గారి విగ్ ఉండేది. ఇక అలా విగ్ పెట్టుకోవడం వల్ల ఆయనకు జుట్టు రాలిపోయి బట్టతల వచ్చింది.

ఇక మహేష్ కు కూడా మేకప్ వేసానని మాధవరావు గారు తెలిపారు. కొడుకు దిద్దిన కాపురం సినిమాలో మేకప్ చేశాను, అలాగే మహేష్ కూడా కొంచెం విగ్ వాడుతారంటూ ఆయనకు కొంచెం జుట్టు పలుచగా ఉంటుంది అందుకే వాడుతారు అంటూ చెప్పారు. ఇక ఇప్పుడు మహేష్ కి మేకప్ మాన్ గా ఉన్నది నా మేనల్లుడు పట్టాభి అంటూ మాధవరావు గారు తెలిపారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

5 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago