Categories: FeaturedMovie News

Producer Natti Kumar : ఆ ఫ్యామిలీకి అప్తమిత్రుడిగా చెబుతున్నా.. కృష్ణ విజయనిర్మల గారు ఎవరెవరికి ఎంత వాటా ఆస్తి ఇచ్చారంటే : నిర్మాత నట్టి కుమార్

Producer Natti Kumar : సూపర్ స్టార్ కృష్ణ గారు మరణించి ఇంకా వారమైనా గడవక ముందే అప్పుడే సోషల్ మీడియాలో ఆయన ఆస్తుల గురించి ఇవి ఎవరికి చెందుతాయి, నరేష్ కి వాటా ఉంటుందా అనే అంశాల మీద జోరుగా చర్చ నడుస్తోంది. ఇక కృష్ణ గారి డైరీ లో అసలు ఏమి రాశారు, ఎవరికి ఆస్తి ఇచ్చారు అనే అంశాల మీద అనేక చర్చలు జరుగుతున్న నేపథ్యంలో అసలు కృష్ణ గారి ఆస్తులు ఆయన పంచారా, ఎవరికి ఇచ్చారు అనే విషయాల మీద క్లారిటీ ఇచ్చారు ప్రొడ్యూసర్ నట్టి కుమార్ గారు.

అప్పుడే వాటాలు ఇచ్చేసారు… వారి ఆస్తులు వారివే…

కృష్ణ గారు, విజయనిర్మల గారు సినిమాలలో నటించినపుడు సంపాదించిన ఆస్తులు ఇప్పుడు కోట్లయ్యాయని అయితే వాటిని వారికి నచ్చిన వారికే ఇచ్చారు అంటూ మాట్లాడటం అపోహ అవుతుందంటూ నట్టి కుమార్ అభిప్రాయపడ్డారు. ఆ ఫ్యామిలీతో 1986 నుండి మంచి సంబంధాలు ఉన్నాయని ఆ చొరవ తోనే విషయాలు చెప్పగలుగుతున్నానని, కృష్ణ గారి ఆస్తులు సెపరేట్ గా విజయనిర్మల గారి ఆస్తులు సెపరేట్ గా ఉన్నాయి.

అయితే కృష్ణ గారు విజయ నిర్మల గారి గొప్పతనం వారికి స్వార్థం లేకపోవడం అంటూ చెప్పారు. వారు ఆస్తులు కూడబెట్టినా వాళ్ల కుటుంబం సభ్యులకు సమానంగా పంచారంటూ చెప్పారు. కృష్ణగారు తమ్ముళ్లకు, అక్కాచెల్లెళ్లకు ఆయన సంపాదించిన ఆస్థిలో సమానంగా వాటా ఇచ్చారు. అలాగే విజయ నిర్మలగారు కూడా ఆమె సంపాదించిన ఆస్థిలో తన తమ్ముళ్లకు ఇచ్చి అలాగే కొడుకు మనవడికి ఇచ్చారు. వాళ్ళు బ్రతికి ఉన్నపుడే ఆస్తి సమాన వాటాలుగా పంచారు. ఇక నిర్మల గారు కృష్ణ పిల్లలకు కూడా ఆస్తి ఇచ్చినట్లు చెబుతారు కానీ అది నాకు తెలియదు. అయితే కృష్ణ గారు నరేష్ కి ఆస్తి ఇవ్వాల్సిన అవసరం లేదు తన తల్లే వందలకొట్ల ఆస్తి ఇచ్చి వెళ్లారు. సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాలన్నీ వట్టివి అని చెప్పారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

5 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago