Kasthuri Shankar : మంత్రి కాన్వాయ్ వెళ్లేవరకూ అంబులెన్సు వేచి ఉండాలా… తమిళ నాడు మంత్రిని ప్రశ్నించిన నటి కస్తూరి…!

Kasthuri shankar : పదవిలో ఉన్న ఒక రాజకీయ నాయకుడి కి భద్రత పరంగా కాన్వాయ్ తో ఎక్కడికైనా వెళ్లడం మామూలే. ఇక వారి భద్రత దృష్ట్యా వాళ్ళు వెళ్లే దారిలో ట్రాఫిక్ ను క్లియర్ చేస్తారు. సాధారణ ప్రజల రాకపోకలను స్థంబింపచేస్తారు. ఇలా మన ఇండియాలో అన్నిచోట్లా సాధారణంగా జరిగేదే. అలాంటప్పుడు సాధారణ జనం ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా పరుగులు పెట్టే టైములో ఆపేస్తే అందరూ ఇబ్బంది పడతారు. కానీ విఐపి వెళ్తారు కాబట్టి ఏం చేయలేని పరిస్థితి. ఐతే తమిళనాడు జరిగిన ఒక సంఘటన మాత్రం ఇప్పుడు చర్చకు దారితీసింది.

17 కార్లు వెళ్లేవరకూ అంబులెన్సు వేచి ఉండాలా…

తమిళనాడులో ఒక మంత్రి పని మీద తాంజవురులో పర్యటించారు. ఈ సందర్బంగా కుంభకోణంలోని అనైకారి బ్రిడ్జి మీద తన కాన్వాయ్ తో వెళ్లారు. అయితే అది వన్ వే కావడంతో మంత్రి కాన్వాయ్ కార్లు మొత్తం 17 వెళ్లెవరకూ మిగిలిన వాహనాలను ఆపేసారు పోలీసులు. ఇక ఆపిన వాహనాల్లో ఒక అంబులెన్సు కూడా ఉండటం తో ఇపుడు అది చర్చనీయ అంశం అయింది. మంత్రి కారు వెళ్ళాక ఆ 17 కార్లు వెళ్లే వరకు అంబులెన్సు వేచి ఉండాలా అంటూ అందరూ ప్రశ్నిస్తున్నారు.

ఇక ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసి నటి కస్తూరి ప్రశ్నించారు. మంత్రి 17 కార్లను ఒకేసారి వెళ్లానివ్వాలా? అంతవరకు అంబులెన్సు వేచి ఉండాలా..? ఏంటిది అంటూ ప్రశ్నించారు సీనియర్ హీరోయిన్ కస్తూరి. అంతే కాకుండా అనైకారి లో మరో బ్రిడ్జి తిరు అన్బిల్ మహేష్ కట్టిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నా అంటూ పోస్ట్ పెట్టారు. ఇదే ఈ ఘటన వల్ల జరిగే మంచి అంటూ రాశారు కస్తూరి శంకర్. ప్రస్తుతం మంత్రి పర్యటన కి సంబంధించిన వీడియా బాగా వైరల్ అవుతోంది.