V.V Vinayak: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో యాక్షన్ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దర్శకులలో వివి వినాయక్ ఒకరు. ఈయన దర్శకత్వంలో ఎన్నో బ్లాక్ బాస్టర్ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.ఇకపోతే తాజాగా ఈయన ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చెన్నకేశవరెడ్డి సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా ఈ సినిమాలో టబు నటించిన పాత్రలో ముందుగా సౌందర్యను తీసుకోవాలని భావించాము అయితే సౌందర్య ఓల్డ్ పాత్రలలో నటించినని చెప్పడంతో ఆస్థానంలో టబు నటించారు. ఇక దేవయాని చేసిన పాత్రలో ముందుగా నటి లయను సంప్రదించాము.ఈ క్రమంలోనే చెన్నకేశవరెడ్డి సినిమా కోసం బాలకృష్ణ చెల్లెలు పాత్రలో నటించాలని ఆమెను కోరాము.
ఇలా బాలకృష్ణకు చెల్లెలి పాత్ర అనగానే ఒక్కసారిగా లయ ఏడ్చేసింది.ఇలా ఈమె కంటతడి పెట్టుకుంటూ చెల్లెలి పాత్రలకే ఎందుకు అడగాలి తెలుగు అమ్మాయిలు హీరోయిన్గా పనిచేయలేరా? అంటూ ప్రశ్నించారు.మీ ముఖం ఎంతో అమాయకత్వంగా ఉంది అందుకే చెల్లెలు పాత్ర కోసం అడిగాము అంటే ఎందుకండీ అలాంటి పాత్రలు ఇస్తారు హీరోయిన్గా ఎందుకు ఇవ్వరు అంటూ ఆమె ఈ సినిమాని రిజెక్ట్ చేయడంతో వెంటనే తాను ఆమెకి సారీ చెప్పి అక్కడి నుంచి వచ్చేసానని ఈయన వెల్లడించారు.
V.V Vinayak: అలాంటి పాత్రలను సెలెక్ట్ చేయడం ఎంతో కష్టం…
ఇక ఈ సినిమాలో చెల్లెలు పాత్ర కోసం లయ రిజెక్ట్ చేయడంతో వెంటనే నటి దేవయానిని సంప్రదించాము. కథ చెప్పగానే దేవయాని ఈ సినిమాకి ఒప్పుకున్నారు. ఇలా సినిమా ఇండస్ట్రీలో తల్లి చెల్లెలు పాత్రలను సెలెక్ట్ చేయడం చాలా కష్టంగా ఉంటుందని ఈ సందర్భంగా వి వి వినాయక్ అప్పటి విషయాలను వెల్లడించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…