Premi Vishwanath : సినిమాలు ఎంత పెద్ద హిట్ అయినా బుల్లితెర మీద వచ్చే సీరియల్స్ లో పాత్రలు ప్రభావితం చేసినంత చేయలేరు. ప్రతి ఇంట్లోను డైలీ రన్ అయ్యే సీరియల్స్ ఒక్కరోజు చూడకపోయినా ఏమైందో అని తెగ టెన్షన్ పడిపోతుంటారు ఫ్యాన్స్. ఇక తెలుగు బుల్లితెర మీద పాపులర్ సీరియల్ అంటే కార్తీక దీపం. ఆ సీరియల్ రేటింగ్స్ ఓ రేంజ్ లో ఉండేవి. బిగ్ బాస్, ఐపీల్ మ్యాచ్ ఇవేవి ఆ సీరియల్ రేటింగ్స్ ని ప్రభావితం చేయలేకపోయాయి. సీరియల్ లో మెయిన్ హైలైట్ వంటలక్క, డాక్టర్ బాబు. వీళ్లిద్దరు ఎప్పుడు కలుస్తారా అని సీరియల్ అభిమానులు ఎదురుచూస్తూ ఉండేవాళ్ళు. ఇక చివరికి కలిసాక కొద్దిరోజులకే ఆ పాత్రలను చంపేశారు సీరియల్ డైరెక్టర్. ఇక వాళ్ళ పిల్లలు శౌర్య, హిమ ల మీద ప్రస్తుతం స్టోరీ రన్ అవుతోంది.
మళ్ళీ ఎంట్రీ ఇవ్వనున్న వంటలక్క…
ఇక ఇప్పుడు న్యూ జనరేషన్ తో సౌందర్య, ఆనందరావు లను పెట్టి సీరియల్ నెట్టుకొస్తున్నా అభిమానులు మాత్రం వంటలక్క, డాక్టర్ బాబు, మోనితలను బాగా మిస్ అవుతున్నారు. రేటింగ్స్ పరంగా బాగానే ఉన్నా సీరియల్ అభిమానులు మాత్రం సంతృప్తిగా లేరు. దీంతో ఇప్పుడు మళ్ళీ సీరియల్ లోకి వంటలక్క రాబోతోంది. ఈ విషయాన్ని వంటలక్క అలియాస్ దీప సోషల్ మీడియా ద్వారా తెలిపింది. ప్రేమి విశ్వనాథ్ తన ఇంస్టాగ్రామ్ లో కార్తీక దీపం సీరియల్ కి సంబంధించిన ప్రోమో ను షేర్ చేసింది.
అందులో వంటలక్క గెటప్ లో ఉన్న ప్రేమి తో షాట్ రెడీ మేడమ్ అనే మాటలు వినిపించగానే వస్తున్నా అంటూ దీప అంటుంది. ఇక మీ కోసం వస్తున్నా అంటూ కాప్షన్ ఇచ్చింది ప్రేమి. దీంతో కార్తీక దీపం లోకి ప్రేమి మళ్ళీ ఎంట్రీ ఇస్తోందని ఆమె ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. మళ్ళీ కార్తీకదీపం పూర్వ వైభవం వచ్చేసినట్లే వంటలక్క ఎంట్రీ తో అని సంబరపడిపోతున్నారు. ఇక వెల్కమ్ వంటలక్క అయితే వచ్చేటప్పుడు డాక్టర్ బాబుని కూడా తీసుకుని రా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…