Keerthi Suresh: త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న కీర్తి సురేష్… వరుడు బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Keerthi Suresh: నేను శైలజ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి కీర్తి సురేష్.మొదటి సినిమాతోనే అందరిని ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తెలుగు తమిళ భాషలలో వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా సినిమా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్న కీర్తి సురేష్ మహానటి వంటి అద్భుతమైన సినిమాలో నటించి ఏకంగా జాతీయ ఉత్తమ నటి పురస్కారాన్ని అందుకున్నారు.

కేవలం కమర్షియల్ చిత్రాలు మాత్రమే కాకుండా లేడి ఓరియంటెడ్ చిత్రాలలో కూడా నటించిన కీర్తి సురేష్ ఈ సినిమాలతో పెద్దగా గుర్తింపు పొందలేదని చెప్పాలి. ఇకపోతే తాజాగా ఈమె మహేష్ బాబు సరసన నటించిన సర్కారు వారి పాట సినిమా ద్వారా మంచి హిట్ తన ఖాతాలు వేసుకున్నారు. ఈ సినిమా అనంతరం ఈమె తమిళంలోనూ అలాగే తెలుగులోనూ పలు సినిమా షూటింగులతో బిజీగా ఉన్నారు.

కెరియర్లో ఎంతో విజయవంతంగా ముందుకు వెళుతున్న కీర్తి సురేష్ కి సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. త్వరలోనే ఈ మహానటి పెళ్లి పీటలు ఎక్కిపోతోందని, త్వరలోనే తాను కొత్త జీవితాన్ని ప్రారంభించబోతుందని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఈమె తన తల్లిదండ్రులు సూచించిన అబ్బాయిని మనవాడునున్నట్లు సమాచారం.

Keerthi Suresh: వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోబోతున్న కీర్తి….

ఇంతకీ ఈమె పెళ్లి చేసుకోబోయే అబ్బాయి ఎవరు అతని బ్యాగ్రౌండ్ ఏంటి అనే విషయానికి వస్తే ఈమె ప్రముఖ వ్యాపారవేత్త.. తమిళ రాజకీయాలలో ఎంత చురుగ్గా పాల్గొంటున్న ఓ పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి.మరి కీర్తి సురేష్ గురించి వస్తున్నటువంటి ఈ పెళ్లి వార్తలలో ఎంతవరకు నిజము ఉందో తెలియాలంటే ఈ వార్తలు పైకి కీర్తి సురేష్ స్పందించాల్సి ఉంది.ప్రస్తుతం ఈమె నాచురల్ స్టార్ నాని సరసన దసరా అనే సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు. ఈ సినిమాతో పాటు పలు తమిళ సినిమాలలో కూడా నటిస్తున్నారు.