Keerthi Suresh: నేను శైలజ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి కీర్తి సురేష్.మొదటి సినిమాతోనే అందరిని ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తెలుగు తమిళ భాషలలో వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా సినిమా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్న కీర్తి సురేష్ మహానటి వంటి అద్భుతమైన సినిమాలో నటించి ఏకంగా జాతీయ ఉత్తమ నటి పురస్కారాన్ని అందుకున్నారు.
కేవలం కమర్షియల్ చిత్రాలు మాత్రమే కాకుండా లేడి ఓరియంటెడ్ చిత్రాలలో కూడా నటించిన కీర్తి సురేష్ ఈ సినిమాలతో పెద్దగా గుర్తింపు పొందలేదని చెప్పాలి. ఇకపోతే తాజాగా ఈమె మహేష్ బాబు సరసన నటించిన సర్కారు వారి పాట సినిమా ద్వారా మంచి హిట్ తన ఖాతాలు వేసుకున్నారు. ఈ సినిమా అనంతరం ఈమె తమిళంలోనూ అలాగే తెలుగులోనూ పలు సినిమా షూటింగులతో బిజీగా ఉన్నారు.
కెరియర్లో ఎంతో విజయవంతంగా ముందుకు వెళుతున్న కీర్తి సురేష్ కి సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. త్వరలోనే ఈ మహానటి పెళ్లి పీటలు ఎక్కిపోతోందని, త్వరలోనే తాను కొత్త జీవితాన్ని ప్రారంభించబోతుందని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఈమె తన తల్లిదండ్రులు సూచించిన అబ్బాయిని మనవాడునున్నట్లు సమాచారం.
ఇంతకీ ఈమె పెళ్లి చేసుకోబోయే అబ్బాయి ఎవరు అతని బ్యాగ్రౌండ్ ఏంటి అనే విషయానికి వస్తే ఈమె ప్రముఖ వ్యాపారవేత్త.. తమిళ రాజకీయాలలో ఎంత చురుగ్గా పాల్గొంటున్న ఓ పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి.మరి కీర్తి సురేష్ గురించి వస్తున్నటువంటి ఈ పెళ్లి వార్తలలో ఎంతవరకు నిజము ఉందో తెలియాలంటే ఈ వార్తలు పైకి కీర్తి సురేష్ స్పందించాల్సి ఉంది.ప్రస్తుతం ఈమె నాచురల్ స్టార్ నాని సరసన దసరా అనే సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు. ఈ సినిమాతో పాటు పలు తమిళ సినిమాలలో కూడా నటిస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…