Aliya Bhat: బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ దర్శకుడు మహేష్ భట్ వారసురాలుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు అలియా భట్. ఈమె ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటిస్తూ నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా తెలుగులో కూడా ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమయ్యారు.
ఇలా నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె బాలీవుడ్ హాలీవుడ్ అలాగే పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇకపోతే ఈమె బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ ను ప్రేమించుకొని ఈ ఏడాది ఏప్రిల్ 14వ తేదీ ఎంతో ఘనంగా కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఈమెకు వివాహమైన తర్వాత హాలీవుడ్ అవకాశాలు రావడంతో హాలీవుడ్ సినిమాలో నటిస్తున్నారు.
ఇకపోతే పెళ్లయిన రెండు నెలలకే తాను గర్భవతి అని ఈమె గుడ్ న్యూస్ చెప్పారు. ఈమె ప్రెగ్నెంట్ కావడంతో తాను కమిట్ అయిన సినిమాలను త్వర త్వరగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంటున్నారు.ఇక సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే అలియా భట్ సోషల్ మీడియా వేదికగా ఎన్నో పోస్టులు చేస్తూ అభిమానులను సందడి చేస్తుంటారు. తాజాగా ఈమె బేబీ బంప్ ఫోటో షూట్ నిర్వహించి తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఈ విధంగా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ రోజురోజుకు అభిమానులను సంపాదించుకున్న అలియాబట్ ఇంస్టాగ్రామ్ లో ఏకంగా 68.5 మిలియన్ ఫాలోవర్స్ ని సంపాదించుకున్నారు.ఇంతమంది ఫాలోవర్స్ ఉన్న ఈమె కేవలం ఒక పోస్ట్ చేయడం ద్వారా భారీగా డబ్బు సంపాదిస్తారని తెలుస్తోంది. ఇలా ఇంస్టాగ్రామ్ ద్వారా అలియా భట్ ఒక వ్యాపార ప్రకటనకు సంబంధించిన పోస్ట్ చేస్తే సుమారు 80 లక్షల నుంచి కోటి రూపాయల వరకు చార్జ్ చేస్తుందని తెలుస్తోంది.ఏది ఏమైనా ఈ నటీనటులు సోషల్ మీడియా ద్వారా కూడా భారీగానే డబ్బు సంపాదిస్తున్నారని చెప్పవచ్చు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…