Movie News

Ameer Khan : అమీర్ ఖానా అతనేవరో నాకు తెలియదు…షాకింగ్ కామెంట్స్ చేసిన బాలీవుడ్ నటుడు..!

Ameer khan : బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ఎవరో నాకు నిజంగా తెలియదు అంటూ షాకిచ్చాడు బాలీవుడ్ సీనియర్ నటుడు అన్ను కపూర్. అమీర్ ఖాన్ ఎవరో తెలియని వాళ్ళు, అది కూడా సినిమా ఇండస్ట్రీ లో ఉంటారంటే ఆశ్చర్యంగానే ఉంటుంది. ఆయన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్ళని రాబట్టుకుంటాయి. అమీర్ నటించిన లాగాన్, త్రీ ఇడియట్స్, తారే జమీన్ పర్, వంటి సినిమాలు సౌతలోనూ అలరించాయి. ఇక దంగల్ సినిమా అయితే ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది. అత్యధిక వసూళ్లు అందుకున్న టాప్ 5 సినిమాల్లో చోటు సంపాదించుకుంది. అలాంటి ట్రాక్ రికార్డు ఉన్న అమీర్ ఖాన్ అంటే ఎవరో తెలియదని ఒక బాలీవుడ్ నటుడు చెప్పడం విడ్డూరంగా ఉంది.

నిజంగా నాకు తెలియదు…

అన్ను కపూర్ రేడియో డిస్క్ జాకి గా, టీవీ యాక్టర్ గా, సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించిన అనుపమ్ కపూర్, తన నలభై ఏళ్ల కెరీర్ లో బాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించారు. ఇక తాజాగా ఆయన వీడియో షో క్రేష్ కోర్స్ అమెజాన్ ప్రైంలో విడుదల అయింది. అయితే ఈ షో ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న అన్ను కపూర్ కి ఒక జర్నలిస్ట్ నుండి ‘లాల్ సింగ్ చద్దా’ సినిమా గురించి ప్రశ్న ఎదురైంది. ఎవరి సినిమా అని అడుగగా అమీర్ ఖాన్ సినిమా అనగానే అమీర్ ఖాన్ ఎవరో నాకు తెలియదు.

నేను సినిమాలు చూడను నాకు పెద్దగా తెలియదు అంటూ సమాధానం చెప్పడంతో అక్కడ ఉన్న అందరూ షాక్ అయ్యారు. బాలీవుడ్ టాప్ హీరోస్ లో ఒకరైన అమీర్ ఖాన్ తెలియక పోవడం ఏమిటి అని ఆశ్చర్య పోతున్నారు. ఇక అమీర్ నటించిన లాల్ సింగ్ చద్దా సినిమా విడుదలకు సిద్ధమై ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఇక ఇటీవలే బ్యాన్ లాల్ సింగ్ చద్దా అంటూ ట్విట్టర్ ట్రెండ్ కూడా జరిగింది. ఇక ఈ సినిమాలో నాగచైతన్య కూడా నటిస్తుండడం మరో విశేషం.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago