Kirrak RP Father : నేను రుచి చూసాకే చేపల పులుసు బయటికి వస్తుంది…: కిర్రాక్ ఆర్పీ తండ్రి

Kirrak RP Father : జబర్దస్త్ ద్వారా బాగా ఫేమస్ అయిన కిర్రాక్ ఆర్పి అందులో నుండి బయటకు వచ్చాక ఇతర ఛానెల్స్ లో కొద్దిరోజులు షోస్ చేసాడు. ఇక జబర్దస్త్ గురించి మల్లెమాల గురించి బాగా విమర్శించి వైరల్ అయ్యాడు. ప్రస్తుతం కూకట్ పల్లి హైదరాబాద్ లో ‘నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు’ పేరుతో ఒక కర్రీ పాయింట్ పెట్టి మరోసారి వార్తల్లో నిలిచాడు. కట్టెల పొయ్యి మీద వండిన నెల్లూరు నుండి తెప్పించిన చేపలతో చేసిన పులుసుకు బాగానే డిమాండ్ క్రియేట అయింది. జనం ఎగబడ్డారు, ఏకంగా ట్రాఫిక్ జామ్ అయ్యేంతలా కిర్రాక్ కర్రీ పాయింట్ కి డిమాండ్ పెరిగింది. ఇక కూకట్ పల్లి బ్రాంచ్ తరువాత మణికొండ బ్రాంచ్ సక్సెస్ అవ్వగా తాజాగా అమీర్ పేట్ బ్రాంచ్ ఓపెన్ చేసారు. ఇక నెల్లూరు చేపల పులుసు ఇంత సక్సెస్ అవ్వడానికి కారణాలను అలాగే ఇంకా ఎన్ని బ్రాంచ్ లు ఓపెన్ చేయాలనుకుంటున్నారు అనే విషయాలను కిర్రాక్ ఆర్పీ తండ్రి వివరించారు.

నేను రుచి చూసాకే చేపల పులుసు బయటికి…

కిర్రాక్ ఆర్పీ తండ్రి ఉదయం మూడుగంటల నుండి మాస్టర్స్ చేపల పులుసు తయారు చేసే వరకు అక్కడే ఉండి రుచి చూసి చేపల పులుసు బాగా ఉంది అని నిర్ధారించుకున్నపుడే బయటికి కస్టమర్స్ కి పంపిస్తారట. ఈ విషయాన్ని కిర్రాక్ ఆర్పీ తండ్రి ఇంటర్వ్యూలో తెలిపారు. డబ్బు ఎలాగైనా సంపాదించుకోవచ్చు కానీ నమ్మకం సంపాదించుకోవడం ముఖ్యం.

చేపల పులుసు తీసుకువెళ్లే కస్టమర్లకు మంచి రుచిని అందించడం కోసం రోజూ కష్టపడుతామని తెలిపారు కిర్రాక్ ఆర్పీ తండ్రి. సుచి శుభ్రత అలాగే నాణ్యత అన్నీ పాటిస్తూనే ఉన్నామని, ఎన్ని బ్రాంచ్లు ఓపెన్ అయినా అలాగే మైంటైన్ చేస్తామంటూ చెప్పారు. మూడో బ్రాంచ్ ఓపెన్ చేయడం నా కోరిక అని అది ఈ రోజు నెరవేరింది అంటూ సంతోషాపడ్డారు. ఇక అమీర్ పేట్ బ్రాంచ్ ను హీరో శ్రీకాంత్ అలాగే తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఓపెన్ చేసారు.