Acharya Movie: ఆచార్య ప్లాప్ కు కొరటాలకు సంబంధం లేదు.. అతనిది మామూలు అనుభవం కాదు!

Acharya Movie: మెగాస్టార్ చిరంజీవి తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో నటించిన చిత్రం ఆచార్య. ఈ సినిమా నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా గత నెల 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా మొదటి షో తోనే ప్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది.

ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో పాటు రామ్ చరణ్ కూడా నటించారు. ఈ క్రమంలోనే ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడి ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది.ఇకపోతే ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆచార్య సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఆచార్య సినిమా ఫ్లాప్ అవ్వడానికి కొరటాల శివ కారణం కాదని, ఆయనకు సంబంధం లేదని వెల్లడించారు. కొరటాల శివకు ఇదో అనుభవం ఉంది. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన జనతాగ్యారేజ్ కూడా ఆచార్య కాన్సెప్ట్ తోనే వచ్చింది. అయితే ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది అంటూ యండమూరి వెల్లడించారు.మెగాస్టార్ చిరంజీవి నక్సలైట్ గా గతంలో తన దర్శకత్వంలో రక్తసింధూరం అనే చిత్రం తెరకెక్కిన ఈ సినిమా కూడా ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది.

ఆయనకు ఎంతో అనుభవం ఉంది…


ఒక స్టార్ హీరో నక్సలైట్ గా చూపించడం ప్రేక్షకులు స్వీకరించలేకపోయారు. రక్తసింధూరం సినిమాలో నక్సలైట్ గా చిరంజీవిని చూపించి ఇన్స్ స్పెక్టర్ గా చిరంజీవిని చూపించడంతో సెట్ అవ్వలేదని మేము భావించాము. అయితే ఇన్స్పెక్టర్ స్థానంలో చిరంజీవి బదులు వేరే వారిని పెడితే చిరంజీవి పాత్ర చిన్నది అయిపోతుంది. ఆచార్య విషయంలో కూడా మెగాస్టార్ చిరంజీవి నక్సలైట్ పాత్రల్లో కనిపించారు. అయితే నక్సలైట్ పాత్ర చిరంజీవికి అచ్చి రాలేదని కాదు కానీ కొన్నిసార్లు అలా జరుగుతుంటాయి. ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి కొరటాలకు ఏమాత్రం సంబంధం లేదని, ఆయనకు ఎంతో అనుభవం ఉందని ఈ ఇంటర్వ్యూ సందర్భంగా యండమూరి తెలియజేశారు.