Featured

NTR Craze: తెలంగాణ ఇంటర్ ప్రశ్నాపత్రం లో ఎన్టీఆర్ గురించి ప్రశ్న.. అట్లుంటది అన్నతోని అంటూ వైరల్ చేస్తున్న ఫ్యాన్స్..!

NTR craze : ఆర్ఆర్ఆర్ సినిమా ఏప్రిల్ లో విడుదలయి అటు తెలుగు రాష్ట్రాల్లోనూ, బాలీవుడ్ లోనూ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సినిమాలో నటించిన రామ్ చరణ్, ఎన్టీఆర్ నటన అందరిని ఆకట్టుకుంది. వారిద్దరి మధ్య సాగే సన్నివేశాలు సినిమాకు హైలైట్. ఇక సినిమాలో ఎన్టీఆర్ కు స్క్రీన్ స్పేస్ తక్కువైందని అభిమానులు గింజుకున్నా కొమరం భీముడో పాటకు వస్తున్న క్రేజ్ కు హ్యాపీ అవుతున్నారు. ఈ మధ్యనే కొమరం భీముడో పాటను యూట్యూబ్ లో విడుదల చేసింది ఆర్ఆర్ఆర్ టీం. ఇక ఈ పాటకు మంచి స్పందన వస్తోంది.

ఇంటర్ ఇంగ్లీష్ ప్రశ్నాపత్రంలో ఎన్టీఆర్ గురించి ప్రశ్న….

ఆర్ఆర్ఆర్ మేనియా ఇంకా తగ్గనే లేదు. ఈ మధ్య చాలా మంది రీల్స్ లో ఇంకా నాటు నాటు అనో కొమరమ్ భీముడో అనో పాటలకు వీడియోలు చేస్తూనే ఉన్నారు. ఇక ఇపుడు తెలంగాణ ఇంటర్ బోర్డు పరీక్షలలో ఇంగ్లీష్ ప్రశ్నాపత్రంలో ఎన్టీఆర్ కొమరం భీముడు గురించి ప్రశ్న వచ్చింది. ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమరంభీం పాత్రలో తన యాక్టింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఎన్టీఆర్‌ను మీరు ఓ రిపోర్టర్‌గా ఇంటర్వ్యూ చేసి ప్రశ్నలు అడిగి, సమాధానాలు తెలుపుతూ ఓ వ్యాసం రాయండి అని ప్రశ్నగా ఇచ్చారు. ఇక ఎన్టీఆర్ అభిమానులు ఊరికే ఉంటారా… ఆ పేపర్ ను సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తూ వైరల్ చేసేసారు.

అది అన్న యాక్టింగ్ పవర్ అంటూ.. తారక్ అభిమానులు ట్వీట్లు చేస్తున్నారు. అట్లుంటది తారక్ అన్నతోని అంటు మరికొందరు ఫ్యాన్స్ అంటు రచ్చ చేస్తున్నారు. అన్న నటన కు సంబంధించిన లైబ్రరీ అంటూ మరికొంత మంది ట్వీట్ చేస్తున్నారు. ఇక ఇప్పటి వరకు ఏ సినిమా అందుకొని మరో రికార్డును ఆర్ఆర్ఆర్ నమోదు చేసింది. హైదరాబాద్ లోని సుదర్శన్ 35mm థియేటర్లో 50 రోజులకు 5 కోట్లు గ్రాస్ వసూళ్లు చేసి రికార్డు సృష్టించింది.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago