Featured

NTR – Koratala: కొరటాల శివ – ఎన్టీఆర్ సినిమాతో ఎవరి సెంటిమెంట్ గెలుస్తుందో..?

NTR – Koratala: ప్రస్తుతం ఎన్టీఆర్, రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ ఘన విజయం తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. కానీ ఎన్టీఆర్ అభిమానులు మాత్రం ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ చేయబోయే చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో సినిమా కాకపోతే బాగుండు అని అనుకుంటున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో సినిమా ఆల్మోస్ట్ ఖరారు అయ్యాక ఫ్యాన్స్ ఇలా ఆలోచించడానికి కూడా కారణాలు లేకపోలేదు. కొన్ని సెంటిమెంట్ లను ద్రుష్టి లో పెట్టుకొని ఫాన్స్ ఇలా ఆలోచిస్తున్నారట…

రాజమౌళి సెంటిమెంట్….

రాజమౌళి సినిమాల సెంటిమెంట్‌ ఎన్టీఆర్ సినిమాపై ఎక్కడ దెబ్బ పడుతుందా అని ఫ్యాన్స్‌ ఆందోళనపడుతున్నారు. రాజమౌలి తో సినిమా తీసిన తరువాత ఆ హీరో కి తరువాతి సినిమా ప్లాప్ అవుతుంది అని ఇండస్ట్రీ లో సెంటిమెంట్. అయితే ఇండస్ట్రీ ఇలాంటి సెంటిమెంటులని బాగా నమ్ముతోంది. ఇటీవల రామ్ చరణ్ మెగాస్టార్ కలసి నటించిన ఆచార్య ఎంతటి డిజాస్టర్ అయిందో తెలిసిందే. అయితే ఇపుడు రాజమౌళి సెంటిమెంట్ ఎన్టీఆర్ – కొరటాల శివ సినిమా మీద పడుతుందేమో అని ఫాన్స్ భయపడుతున్నారు. అయితే ఎన్టీఆర్ ఈ సెంటిమెంట్ నుండి బయటపడాలని కోరుకుంటున్నారు. అయితే ఎన్టీఆర్ సినిమాలకు ఇంకొక సెంటిమెంట్ కూడా ఉంది.

ప్లాప్ డైరెక్టర్ సెంటిమెంట్…..

ఎన్టీఆర్ సినిమాలలో ఇంకో సెంటిమెంట్ కూడా ఇపుడు తెరమీదకు వచ్చింది. రీసెంట్‌గా డిజాస్టర్ వచ్చిన డైరక్టర్‌తో సినిమా చేస్తే ఎన్టీఆర్ హిట్‌ కొడతాడు అనే సెంటిమెంట్‌ కూడా ఉంది. ‘నాన్నకు ప్రేమతో’ ‘అరవింద సమేత’, ‘జై లవకుశ’ సినిమాల విజయాలే ఇందుకు ఉదాహరణ. అయితే కొరటాల శివ కు కూడా ఆచార్య సినిమాతో డిజాస్టర్ వచ్చినట్లే. ఇప్పుడు ఫ్లాప్ ఇచ్చిన కొరటాల శివ ఎన్టీఆర్ తో సినిమా తీస్తే అది విజయం సాధిస్తుంది అని కూడా అభిమానులు నమ్ముతున్నారు. పైగా కొరటాల శివ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన జనతా గ్యారేజ్ ఎంతటి విజయాన్ని సాధించిందో అందరికి తెలిసిందే. ఇప్పుడు ఎన్టీఆర్ కు అంతకుమించిన విజయం ఇవ్వడానికి కొరటాల రెడీ గా ఉన్నారు. తాజాగా కథ అద్భుతంగా ఉంటుందని, ఖచ్చితంగా పెద్ద విజయం సాధిస్తుంది అంటూ కొరటాల చెప్పారు . చూడాలి మరి ఎన్టీఆర్ కొరటాల శివ సినిమాకు ఏ సెంటిమెంట్ పనిచేస్తుందో.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago