కడిగిన బియ్యం నీటిలో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.. అవేంటో తెలుసుకోండి?

సాధారణంగా బియ్యాన్ని మనం కడిగి వండుకుంటాం. కడిగిన తర్వాత ఆ నీటిని మనం పారబోస్తాం. కానీ ఆ నీటిలోనే ఎక్కువగా ఔషద గుణాలు ఉంటాయి. పాలిష్ ఎక్కుగా చేసిన బియ్యం తింటే బెరిబెరి వ్యాధి వస్తుందన్న సంగతి తెలిసిందే. అందుకే పాలిష్ ఎక్కవగా చేసిన బియ్యం తినకూడదు. మరి కడిగిన బియ్యాన్ని అప్పట్లో ఓ కుండలో పోసి దానిని మరుసటి రోజు సేవించేవారు.

ఇలా చేయడం ఎలాంటి వ్యాధులు లేకుండా చాలా కాలం జీవించేవారు. అయితే వాటి వల్ల అధనపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి. జపాన్, దక్షిణ కొరియా లో దీనిని ఉపయోగించి చర్మాన్ని కాపాడే ఔషదాలల్లో వాడుతున్నారు. బియ్యాన్ని 15 నిమిషాలు నానబెట్టాక… ఆ నీటిని వేరు చెయ్యాలి. ఆ తరవాత బియ్యాన్ని వేరే నీటితో కడుక్కోవచ్చు.

వేరు చేసిన నీటిని ఫ్రిజ్‌లోని ఐస్ క్యూబ్ ట్రేలలో వెయ్యాలి. ఆ ట్రేలలో నీరు గడ్డకట్టి… ఐస్ క్యూబ్స్ తయారవుతాయి. ఆ ఐస్ క్యూబ్స్ ను స్నానానికి వెళ్లే ముందు 10 నిమిషాల పాటు చర్మంపై రుద్దుకోవాలి. దీంతో చర్మ వ్యాధులు రాకుండా ఉంటాయి.

అంతేకాకుండా ఆ నీటిని ఏదైనా స్ప్రే బాటిల్‌లో పోసి ఫ్రిజ్‌లో పెట్టి కూడా వాడుకోవచ్చు. వాటిని అవసరం ఉన్నప్పుడల్లా భయకటు వెళ్లే సందర్భాల్లో చేతులు, ముఖంపై అప్లై చేసకుంటే మంచి ఫలితాలు వస్తాయి. ఇలా ఆ నీటిని ఉపయోగించి కోరియా ప్రజలు చర్మ వ్యాధుల నుంచి ఉపశమనం పొందుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ ఈ విధమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందాలంటే బియ్యం కడిగిన నీటితో ఇలా ప్రయత్నించండి.