Krishna Vamsi : దేశమంటే మనుషులోయ్ అని చెప్పేవారికి నెను చెప్పేది ఒకటే… ఇంకో 50 సంవత్సరాలకు యుగాంతం : కృష్ణ వంశీ

Krishna Vamsi : తెలుగు ఇండస్ట్రీస్ లో విలక్షణమైన సినిమాలు తీసి డైరెక్టర్ గా హిట్లకంటే సమాజానికి ఉపయోగపడే సినిమాలు తీసే డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న కృష్ణ వంశీ స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా దేశం మీద ఉండాల్సిన దృక్పదం, ఇప్పుడు యువతరం ఎలా ఉన్నారు, ఆలోచన ధోరణి ఎలా ఉంది అనే విషయాల గురించి మాట్లాడారు. ప్రజల్లో వ్యతిరేకత వస్తే ఎలాంటి పరిణామలు ఉంటాయో ఆయన వివరించారు. ఇక యుగాంతం వంటి ఇంట్రెస్టింగ్ విషయాల గురించి మాట్లాడారు.

దేశమంటే మనుషులు ఒక్కటే కాదు…

భిన్నత్వంలో ఏకత్వం కేవలం మనం దేశంలోనే లేదు, అన్ని దేశాల్లోను ఉంది. ఏ దేశంలో అయినా అసమానతలు ఎప్పుడు ఉంటాయి అవి సమసిపోవు. ఇక ఇన్నేళ్ల స్వాతంత్ర భారత దేశంలో ఎంతో సాధించాము. ఒకప్పుడు మన మీద పెత్తనం చెలాయించిన దేశాన్ని నేడు ఒక భారత సంతతి వాడు పరిపాలించే అవకాశం ఉంది. ఇక ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాల్లో మార్గనిర్దేశనం చేస్తూ ఎంతో మంది భారతీయులు ఉన్నారు. ఇక ఒక దేశం ఒక ప్రాంతం అని మనం హద్దులు వేసుకుంటున్నాం. కానీ ప్రపంచమంతా ఒక్కటే అందరు మనుషులు ఒక్కటే అంటూ కృష్ణ వంశీ అన్నారు. ఈ మధ్యనే సుద్దాల అశోక్ తేజ నాకో పుస్తకమిచ్చి దేశమంటే మనుషులు మాత్రమే ఎలా అంటూ ప్రశ్నించారు. ఈ భూమి మీద మనుషులు మాత్రమే అన్నట్లుగా వ్యవహారిస్తున్నాం. ప్రతి జీవికి, చెట్టుకి, కొండలకు, పర్వతలకు ఈ భూమి మీద బ్రతికే హక్కు ఉంటుంది కదా అంటూ ఆయన అభిప్రాయపడ్డారు.

బుద్ధి జీవులం అనుకుని ఈ భూమిని నాశనం చేస్తున్నాము అంటూ మాట్లాడారు. స్టీవెన్ హాకిన్స్ ఎప్పుడో చెప్పేసారు ఇక ఈ భూమి మనుగడ కొన్నేళ్ళే వేరే గ్రహం చూసుకోండి అంటూ. అది ఇంకో యాభై ఏళ్ళు మాత్రమే అని చెప్పారు కృష్ణ వంశీ. జనం ఎప్పుడు చూస్తూనే ఉంటారు కానీ వాళ్ళ జీవనపోరాటం నుండి ఒక్కసారి బయటికి వచ్చి రాజకీయ నాయకుల గురించి ఆలోచిస్తే అపుడు ఇక ఆ నాయకుల కుటుంబంతో సహా అందరూ ఇంటికి వెళ్ళాల్సిందే. హిట్లర్ అంతటి వాడే జనం వ్యతిరేకత ముందు నిలబడలేక పోయాడు. పబ్లిక్ కి అంత పవర్ ఉంది, కాకపోతే అన్ని వాళ్ళు చూస్తూ ఉంటారు వాళ్ళేం పిచోళ్లు కాదు అంటూ కామెంట్స్ చేసారు. ఇక యువతరానికి చరిత్ర చదవాలని సూచించారు. స్వాతంత్రం ఎలా వచ్చిందో నిజానిజాలు తెలుసుకోవాలని సూచించారు.