Allu Arjun -Ramcharan: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో అభిమానులకు మరో హీరో అభిమానులకు మధ్య పోటీ ఉండడం సర్వసాధారణం. అయితే ఈ పోటీ కేవలం సినిమాల వరకు మాత్రమే ఉంటే బాగుంటుంది కానీ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత అభిమానుల ఆగడాలకు హద్దు లేకుండా పోతుంది. ఇలా ఒక హీరో పై యాంటీ ఫ్యాన్స్ అసభ్యకరమైన పదజాలంతో కామెంట్లు చేస్తూ మరొక హీరో అభిమానులను రెచ్చగొడుతున్నారు.
ఇలా హీరోల అభిమానుల మధ్య సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కోల్డ్ వార్ నడుస్తుంది. తాజాగా ఇలాంటి యుద్ధమే మెగా కాంపౌండ్ లో నడుస్తుందని చెప్పాలి. అల్లు అర్జున్ రామ్ చరణ్ అభిమానుల మధ్య ఈ విధమైనటువంటి మాటల యుద్ధం జరుగుతోంది. అల్లు అర్జున్ అభిమానులు రామ్ చరణ్ ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా . #GhantaLeniVarasudu అంటూ ఓ హ్యాష్ టాగ్ క్రియేట్ చేసి వైరల్ చేస్తున్నారు.
ఇది చూసిన రామ్ చరణ్ అభిమానులు తామేమి తక్కువ కాదంటూ వాళ్లు కూడా సోషల్ మీడియా వేదికగా #ThammudiGhantaPhalAAm అనే హ్యాష్ టాగ్ తో అసభ్యకరంగా ట్రోలింగ్ చేస్తున్నారు. ఇలా ఇద్దరి హీరోల అభిమానులు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున అసభ్యకర పదజాలంతో హీరోలను ట్రోల్ చేయడమే కాకుండా వారి భార్యలను కూడా ఇలా ట్రోల్ చేస్తూ ఉన్నారు.
సాధారణంగా అభిమానుల మధ్య సినిమాల విషయంలో ఈ విధమైనటువంటి మాటల యుద్ధం జరగడం సర్వసాధారణం అయితే ఈ మధ్యకాలంలో ఏకంగా వారి కుటుంబ సభ్యులను కూడా ప్రస్తావిస్తూ దారుణానికి వడిగడుతున్నారని చెప్పాలి. ఇలా సోషల్ మీడియా వేదికగా అభిమానులు చేస్తున్న ఈ కామెంట్స్ వల్ల సెలబ్రిటీలు సైతం విచారం వ్యక్తం చేసే పరిస్థితులను అభిమానులు క్రియేట్ చేస్తున్నారని చెప్పాలి.ఇక వీరి సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాతో బిజీగా ఉన్నారు. అల్లు అర్జున్ త్వరలోనే పుష్ప2 సినిమాతో బిజీ కానున్నారు.
వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచే సహజ పానీయాలపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. ఈ క్రమంలో సంప్రదాయంగా ఉపయోగించే “బాదం…
సౌత్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన హీరోయిన్ శృతి హాసన్ మరోసారి వ్యక్తిగత జీవితంతో వార్తల్లో నిలిచింది.…
ప్రసిద్ధ సినీ నటి తమన్నాభాటియా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి భక్తిశ్రద్ధలు చాటుకున్నారు. తిరుమల దేవాలయంలోఉదయం వేళలోనే ఆమె స్వామివారిని…
టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ అనన్య నాగళ్ల ఇటీవల సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె…
తెలంగాణకు చెందిన ఓ భక్తుడు తన భక్తిశ్రద్ధలను ప్రత్యేకంగా చాటుకున్నారు. హైదరాబాద్కు చెందిన ఈ భక్తుడు, ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీశైలం…
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ వైష్ణవక్షేత్రాలలో ఒకటైన సింహాచలం దేవాలయంలో జరగబోయే చందనోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రతి ఏడాది విశేషంగా నిర్వహించే…