KS Prasad : జగన్ మాస్టర్ ప్లాన్ తో జనసేన టీడీపీ ఉక్కిరి బిక్కిరి.. ఏపీ లో రోడ్డు షోలు సభలు బంద్.. ప్రతిపక్షాలను అణిచివేసే ప్రయత్నమా…: కేఎస్ ప్రసాద్

KS Prasad : ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్నికలకు ఇంకో సంవత్సరం సమయం ఉంది అయితే అప్పుడే ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమవుతూ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. పొత్తులు, పర్యటనలు అంటూ బిజీ అయిపోయారు. ఇక ఏపీ లో అయితే ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ఎక్కడ సభ ఏర్పాటు చేసినా అక్కడ బాగా జనం రావడం కనిపిస్తోంది. అయితే జనం రావడామేమో కానీ భద్రత వైఫల్యమో లేక కావాలని కుట్ర చేస్తున్నారో కానీ తొక్కిసలాట జరిగి అవాంఛనీయ సంఘటనలు జరిగాయి. ఇటీవల జరిగిన కందుకూరు, గుంటూరు సభలలో తొక్కిసలాటలో ప్రజలు ఇబ్బందులను ఎదుర్కోవడం, ప్రాణాలను కోల్పోవడం జరిగింది. ఇక వీటిపై ప్రతిపక్షం ఒకలా చెబుతుంటే అధికారం పక్షం మాత్రం తన వాదన ఇంకోలా వినిపిస్తోంది. రాత్రికి రాత్రే సభలు, రోడ్డు షోలు చెయకూడదంటూ జీవో జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. దీనిపై పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ విశ్లేషించారు.

ప్రతిపక్షాలను అణచివేయడానికేనా…

ప్రసాద్ గారు మాట్లాడుతూ ప్రతిపక్ష నేత మీటింగ్ లో జనాలు తొక్కిసలాటలో మరణించడం మీద ప్రభుత్వం ప్రతిపక్షం రెండు బాధ్యత తీసుకోవాలంటూ చెప్పారు. టీడీపీ ఈ విషయంలో బాధ్యత తీసుకుని ఆల్రెడీ బాధితులకు పరిహారం ఇచ్చింది. అయితే ప్రభుత్వం కేవలం జీవో జారీ చేసి ఇక సభలు, రోడ్డు షోలు బంద్ అని చెప్పి సరి పెట్టుకుంటే ఎలా అంటూ అభిప్రాయపడ్డారు. జీవో లో షరతులకు లోబడి సభ నిర్వహించుకోవచ్చని ఉంది. అయితే ఇవన్నీ ప్రతిపక్షాన్ని అణిచివేయడానికి అన్నట్లుగా భావించనవసరం లేదు. అయితే ప్రభుత్వం తగిన భద్రత ఏర్పాట్లను చేయాలి ఒక సభ అన్నపుడు అది చేయడంలో వైఫల్యం కనిపిస్తోంద అంటూ అభిప్రాయపడ్డారు.

రాజకీయ పార్టీలు ఇలాంటి సభలను ఏర్పాటు చేసినపుడు జాగ్రత్తలు పాటించాలి లేకపోతే సాధారణ జనం ఇబ్బందులను ఎదుర్కొంటారు అంటూ తెలిపారు. ప్రభుత్వం జీవో సరిగా చదవని వారు సభలను, రోడ్డు షోలను నిషేదించారు, బ్రిటిష్ కాలం నటి జీవో తీసుకొచ్చారని మాట్లాడుతున్నారు. ఈ విషయంలో ప్రతిపక్షం కోర్ట్ మెట్లెక్కింది. ఒకవేళ ఆ జీవో బ్రిటిష్ కాలం నాటి చట్టం అయితే ఖచ్చితంగా కోర్ట్ లో న్యాయం జరుగుతుంది అంటూ మాట్లాడారు.