L.B. Sriram : ఈవివి గారు చిరంజీవి దగ్గరకు తీసుకెళ్తే ఆయన ఇచ్చిన సలహా నాకు నచ్చలేదు… కానీ చివరికి అదే నిజమైంది : ఎల్బి శ్రీరామ్

L.B. Sriram : కమెడియన్ గా అందరికీ బాగా తెలిసిన ఎల్బి శ్రీరామ్ గారు మంచి హాస్యానటుడే కాదు గొప్ప రైటర్ కూడా. ఆయన డైలాగు రైటర్ గా సినిమాలకు పనిచేసారు. విభిన్న మైన డైలాగు డెలివరీతో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న శ్రీరామ్ గారు ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ ఆయన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే బ్యానర్ మీద షార్ట్ ఫిలిమ్స్ ను తీస్తున్నారు. సినిమాల్లో ఇస్తున్న మూస పాత్రలను చేయడం ఇష్టం లేక వాటి నుండి తప్పుకున్నాను అంటూ శ్రీరామ్ చెప్పారు. ప్రైవేట్ బ్యాంకులో పనిచేస్తూ సినిమాల్లో అవకాశాల కోసం కష్టపడిన ఎల్బి శ్రీరామ్ గారు ప్రస్తుతం కవి సామ్రాట్ అనే షార్ట్ ఫిల్మ్ ను ఆహా ఒరిజినల్స్ లో చేశారు. ఒక మూస పాత్రలతో ఇమడలేక చాలా సినిమాలను వదులుకున్న ఆయన ప్రస్తుతం రచయితగా షార్ట్ ఫిలిమ్స్ తీస్తూ యువతకు మంచి జ్ఞానాన్ని ఇస్తున్నారు.

చిరంజీవి గారు ఇచ్చిన సలహా నాకు నచ్చలేదు.. కానీ అదే నిజమైంది…

మొదట ఎల్బి శ్రీరామ్ గారి కమెడియన్ చేసింది ఈవివి సత్యనారాయణ గారు. డిఫరెంట్ డైలాగు మోడ్యులేషన్ తో శ్రీరామ్ గారు మొదటి సినిమాతోనే ప్రేక్షకులకు నచ్చేసారు. ఇక అప్పటి వరకూ రచయిత గా ఉన్న ఆయన ఒక్కసారిగా స్టార్ కమెడియన్ అయ్యారు. ఈవివి గారు చిరంజీవి గారిని కలవడానికి వెళితే శ్రీరామ్ గారిని కూడా వెంట రా ఆయన బ్లెస్సింగ్స్ అందుతాయి అంటూ తీసుకెళ్లారట. అక్కడ చిరు గారు శ్రీరామ్ గారితో మాట్లాడుతూ చాలా బాగుంది మీ కామెడీ టైమిం,గ్ సినిమాలో కొనసాగిస్తారా లేక రచయితగానే ఉంటారా అని అడిగితే ఒకే మూసలో వెళ్లాలని లేదండి డిఫరెంట్ గా ట్రై చేయాలని ఉంది అని చెప్పారట. అయితే చిరు ఒకరికి ఒకటి సెట్ అయ్యాక వేరే ప్రయత్నం అంటే అంత సక్సెస్ కాలేరేమో, ఏమో కాలమే నిర్ణయిస్తుంది అంటూ చెప్పారట.

ఇప్పుడున్న దాంట్లో కొనసాగితే బాగుంటుందని సలహాలు ఇచ్చారట. కానీ అలా మూసలో ఉండటం ఇష్టం లేని శ్రీరామ్ గారు ఆమ్మో ఒకటో తారీఖు వంటి సీరియస్ పాత్రలను చేశారు. కానీ అంతవరకు కామెడీ చేసిన ఆయనను ఒక్కసారిగా ఎమోషనల్ పాత్రలో జనాలు ఒప్పుకోలేక పోయారు. అయితే ఆ తరువాత మాత్రం అన్నీ ఎమోషనల్ పాత్రలు రావడం మొదలయిందట దీంతో మళ్ళీ మూసలో వెళ్లాల్సి వస్తుందని సినిమాలకు గ్యాప్ ఇచ్చారట ఎల్బి శ్రీరామ్ గారు. ఇక ఆయన కమెడియన్ గా చేసిన డైలాగు మాడ్యులేషన్ కి స్ఫూర్తి వాళ్ళ ఊర్లో తన స్నేహితుడు అంటూ చెప్పారు.