Rashmika: అందరికీ నా నటన నచ్చాలని లేదు.. రోల్స్ పై ఘాటుగా రియాక్ట్ అయిన రష్మిక?

Rashmika: రష్మిక మందన్న ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస భాషా చిత్రాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఈమె ప్రస్తుతం తెలుగు తమిళ భాష చిత్రాలతో పాటు హిందీలో కూడా సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా బిజీ అయ్యారు. ఇకపోతే ఇటీవల బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ తో కలిసి ఈమె యానిమల్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

ఇలా ఈ సినిమాలో గీతాంజలి అనే పాత్రలో నటించినటువంటి రష్మిక నటన పట్ల ఎన్నో ప్రశంసలు వచ్చాయి అలాగే విమర్శలు కూడా వచ్చాయి ముఖ్యంగా ఈ సినిమాలో కర్వాచౌత్ పండుగ సందర్భంగా వచ్చే సన్నివేశాలలో రష్మిక నటన బాలేదంటూ చాలామంది ఈమె నటన పట్ల విమర్శలు చేశారు.

అయితే ఈ విమర్శల గురించి ఇటీవల రష్మిక ఒక ఇంటర్వ్యూలో రియాక్ట్ అవుతూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక నటిగా ఒక సన్నివేశం చేయాలి అంటే ఎన్నో హావభావాలను పలికించాల్సి ఉంటుంది అలా చేయాలి అంటే ఎంత కష్టపడాలో నాకు మాత్రమే తెలుసు అని తెలిపారు. అయినా ఏ సన్నివేశంలో ఎలా నటించాలి అనేది తనకు తెలుసని రష్మిక తెలిపారు.

అందరి అభిరుచి ఒకేలా ఉండదు..
9 నిమిషాల సన్నివేశాలలో కేవలం 10 సెకండ్ల డైలాగ్స్ బాలేదంటూ విమర్శించడం ఎంతవరకు సమంజసం అని ఈమె ప్రశ్నించారు. అయినా అందరి అభిరుచులు ఒకేలా ఉండవు అలాగే అందరికీ నా నటన నచ్చాలని నేను ఏమాత్రం అనుకోను అంటూ ఈ సందర్భంగా రష్మిక తన పట్ల వస్తున్నటువంటి విమర్శలపై ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఇక ఈమె సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం పుష్ప 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.