Maha Shivaratri: శివరాత్రి ఉపవాసంలో తీసుకోవలసిన… తీసుకోకూడని ఆహార పదార్థాలు ఇవే!

Maha Shivaratri: నేడు దేశవ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో శివరాత్రి వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. శివరాత్రి రోజున పరమేశ్వరుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉపవాస జాగరణలతో ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఇక బోలా శంకరుడికి నేడు ప్రత్యేకమైన పూజలను చేస్తారు. ఇక శివరాత్రి రోజు శని త్రయోదశి రావటంతో ఈరోజు ఎంతో విశిష్టమైనదిగా భావిస్తారు.

ఇలా శివరాత్రి రోజు ఉదయం నుంచి మరుసటి రోజు ఉదయం వరకు చాలామంది కఠిన ఉపవాసం ఉంటూ జాగరణ చేస్తూ శివయ్య నామస్మరణలతో లీనమై శివుడికి పూజలు చేస్తుంటారు.మరి ఉపవాసం ఉన్నవారు ఈరోజు ఎలాంటి పదార్థాలను ఆహారంగా తీసుకోవాలి ఎలాంటి పదార్థాలకు దూరంగా ఉండాలి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం…

తీసుకోకూడని ఆహార పదార్థాలు..

శివరాత్రి రోజు ఉపవాసం ఉన్నవాళ్లు పొరపాటున కూడా మాంసాహార పదార్థాలను ముట్టుకోకూడదు. బియ్యం గోధుమలు పప్పులు వంటి తృణధాన్యాలకు పూర్తిగా దూరంగా ఉండాలి. అదేవిధంగా వెల్లుల్లి ఉల్లిపాయ వేసిన ఆహార పదార్థాలను తినకూడదు.

Maha Shivaratri:తీసుకోవలసిన ఆహార పదార్థాలు…

శివరాత్రి రోజు ఉపవాసం ఉన్నవాళ్లు పాలు పండ్లు వంటి ఆహార పదార్థాలను తీసుకోవచ్చు. సగ్గుబియ్యం కిచిడి లేదా సగ్గుబియ్యం జావను తయారు చేసి అల్పాహారంగా తీసుకోవచ్చు. ఇక ఉపవాసం ఉన్నవాళ్లు ఎక్కువగా డిహైడ్రేషన్ కి గురవుతారు ఇలా డిహైడ్రేషన్ కి గురి కాకుండా ఉండాలంటే పండ్ల రసాలను తీసుకోవడం మంచిది. ఇలా పండ్లు పాలు తీసుకుంటూ ఉపవాస జాగరణ చేయడం వల్ల శివయ్య అనుగ్రహం మనపై ఉంటుంది. ఇకపోతే ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు మందులను ఉపయోగించేవారు ఉపవాసం ఉండకపోవడం మంచిది.