devotional

Maha Shivaratri: మహాశివరాత్రి రోజు ఏ సమయం నుంచి ఉపవాసం చేయాలి… ఎలాంటి నియమాలను పాటించాలో తెలుసా?

Maha Shivaratri: నేడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులు అత్యంత భక్తిశ్రద్ధలతో నియమనిష్టలతో పరమేశ్వరుడికి పెద్ద ఎత్తున పూజలు చేస్తూ శివరాత్రి వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు.ఇలా శివరాత్రి పండుగ సందర్భంగా ప్రతి ఒక్క శివాలయాలలో శివనామస్మరణతో భక్తులు శివయ్యకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఇక శివరాత్రి అంటేనే అందరికీ గుర్తొచ్చేది ఉపవాసం జాగరణ.ఇలా శివరాత్రి రోజు ఉపవాసం ఎప్పుడు ఏ సమయం నుంచి మొదలుపెట్టి ఏ సమయం వరకు ఉండాలి ఈ ఉపవాస సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయం చాలామందికి తెలియదు.

ఈ క్రమంలోని శివరాత్రి రోజు ఉపవాసం ఏ సమయం నుంచి ఏ సమయం వరకు ఉండాలో ఇక్కడ తెలుసుకుందాం… శివరాత్రి నేడు అనగా ఫిబ్రవరి 18వ తేదీ వచ్చింది కనుక ఫిబ్రవరి 18వ తేదీ శనివారం తెల్లవారుజామున నుంచి ఫిబ్రవరి 19 మరుసటి రోజు సూర్యోదయం అయ్యేవరకు ఉపవాసం తప్పనిసరిగా ఉండాలి. ఇలా ఉపవాసంలో ఉండి ఇతరులను దుర్భాషలాడకూడదు. ఇతరులపై ఆగ్రహం వ్యక్తం చేయకూడదు. కేవలం ప్రశాంతమైన మనసుతో శివయ్యను కొలుస్తూ శివుడిని పూజిస్తూ ఆధ్యాత్మిక చింతనలో ఉండాలి.

ఇలా ఉపవాసంతో పాటు శివరాత్రి రోజున శివుడిని నాలుగు దశలలో పూజించాలి. ఇలా ఈ నాలుగు దశలలో పూజించినప్పుడు తప్పనిసరిగా పరమేశ్వరుడి అనుగ్రహం మనకు కలుగుతుందని చెప్పాలి మరి నాలుగు దశలలో అంటే ఏ సమయంలో పరమేశ్వరుడిని పూజించాలి అనే విషయానికి వస్తే..మెుదటి ప్రహర పూజ సమయం ఉదయం 06:40 ప్రారంభించి 9:47 వరకు చెయ్యాలని. ఇక రెండవ ప్రహర పూజా సమయం 9:47 నుంచి 12:53 వరకు చేయాలి.

Maha Shivaratri: శివయ్య ధ్యాసలో ఉండాలి…

ఇక మూడవ ప్రహర పూజ సమయం 12:53 నుంచి 4:00 వరకు ఇక చివరిగా నాల్గవ ప్రహర పూజా సమయం 4:00 నుంచి మరుసటి రోజు ఉదయం 7 గంటల వరకు అత్యంత భక్తి శ్రద్దలతో నిర్వహించాలని పండితులు చెప్పుకొచ్చారు.ఈ పూజలన్నింటిలోనూ శివుడిని కొలుస్తూ శివనామస్మరణలతో శివలింగానికి ప్రత్యేక అభిషేకాలు అలంకరణ చేస్తూ శివయ్యను పూజిస్తూ ఉండాలి. ఇలా చేసినప్పుడే ఆ శివుడి అనుగ్రహం మనపై ఉంటుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago