Mahesh Babu: సాయంత్రం 6 దాటితే నిద్రోచ్చేస్తుంది..! టాక్ షోలో బాలయ్యతో సందడి చేసిన మహేష్ బాబు..!

Mahesh Babu: తెలుగు ఓటీటీ ప్లాట్ ఫాం ఆహాలో ప్రసారం అవుతున్న రియాల్టీ టాక్ షో అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలయ్య హోస్ట్ గా నిర్వహిస్తున్న ఈ షోలో ఇప్పటికే ఎన్నో ఎపిసోడ్ లు పూర్తి చేసుకున్నాయి.

Mahesh Babu: సాయంత్రం 6 దాటితే నిద్ర వస్తుంది..! టాక్ షోలో బాలయ్యతో సందడి చేసిన మహేష్ బాబు..!

మొదట మంచు ఫ్యామిలీతో సందడి చేసిన బాలయ్య.. తర్వాత న్యాచురల్ స్టార్ నానీతో సందడి చేశాడు. ఆ షోల నుంచి ఎక్కువగా వ్యూస్ వచ్చాయి. బాలయ్య హోస్ట్ గా ఇంత పాపులర్ అవుతుందని ఎవరూ ఊహించి ఉండరు కూడా. దీంతో బాలయ్య అభిమానులు కూడా సంతోషంలో ఉన్నారు.

Mahesh Babu: సాయంత్రం 6 దాటితే నిద్ర వస్తుంది..! టాక్ షోలో బాలయ్యతో సందడి చేసిన మహేష్ బాబు..!

ఇక తాజాగా బాలయ్యతో సందడి చేస్తూ కనిపించాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. మహేష్ బాబుతో ఈ షో ఎప్పుడో పూర్తి అయినప్పటికీ.. నిర్వాహకులు ప్రసారం చేయలేదు. ఆ ఎపిసోడ్ కు ఎక్కువగా వ్యూస్ వస్తాయన్న నమ్మకంతో చాలా ఆలస్యంగా స్ట్రీమింగ్ చేశారు. నిన్నటి నుంచే ఈ ఎపిసోడ్ ప్రసారం అవుతుండగా… భారీగీ వ్యూస్ వస్తున్నట్లు సమాచారం.


తన నాన్న గురించి చెబుతూ..

ఇక ఈ ఎపిసోడ్ లో మహేష్ బాబు ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తాను సాయంత్రం 6 తర్వాత షూటింగ్ లో పాల్గొను అంటూ చెప్పుకొచ్చాడు. సాయంత్రం 6 దాటితే నిద్ర వస్తుందని తెలిపాడు. ఇక తన సినిమాలు గౌతమ్, సితారా చూస్తారని.. బాగుంటే బాగుందని నచ్చకపోతే నచ్చలేదని చెబుతారని మహేష్ అన్నారు. తన ఫ్యామిలీతో కలిసి సినిమాలు చూడటం అంటే ఎంతో సంతోషంగా ఉంటుందని చెప్పుకొచ్చాడు. తన నాన్న గురించి చెబుతూ.. అతడు నటించిన అల్లూరి సీతారామరాజు సినిమా నాకు బైబిల్ అయిపోయిందని మహేష్ చెప్పుకొచ్చాడు. ఇక మహేష్ బాబు పుట్టిన రోజు ఫంక్షన్లు నిర్వహించే సమయంలో చాలామంది రూ.2 వేల నుంచి రూ. 3వేల వరకు ఇచ్చేవారని.. వాటిన తన అమమ్మ తీసుకునేవారని చెప్పాడు. తాను చేసిన అల్లరి పనులకు ఎప్పుడూ అమమ్మ కొట్టేదని చెప్పాడు. ఇక ప్రస్తుతం ఈ షో తెగ వైరల్ గా మారింది.