Manchu Manoj -Mounika: అనాథ చిన్నారులతో కలసి ఆది పురుష్ సినిమా చూసిన మనోజ్ మౌనిక!

Manchu Manoj -Mounika: ప్రభాస్ నటించిన ఆది
పురుష్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా జూన్ 16 వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనకు తెలిసిందే. రామాయణం నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా విడుదలకు ముందే పలువురు హీరోలు పెద్ద ఎత్తున టికెట్లను కొనుగోలు చేసిన సంగతి మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే భూమా మౌనిక మనోజ్ దంపతులు కూడా అనాధ పిల్లల కోసం ఏకంగా 2500 టికెట్లను కొనుగోలు చేశారు.రామాయణం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ ఈ సినిమాను చూడాలని ముఖ్యంగా చిన్నపిల్లలు రామాయణం గొప్పతనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న ఉద్దేశంతోనే ఇలా అనాధల కోసం టికెట్లు కొనుగోలు చేసినట్టు ఈయన సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.

ఈ విధంగా అనాధ పిల్లల కోసం టికెట్లను కొనుగోలు చేయడమే కాకుండా మొదటి రోజు సినిమా విడుదలైన తరువాత అనాధ పిల్లలతో కలిసి భూమా మౌనిక మనోజ్ దంపతులు ఈ సినిమాని చూశారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నిజంగానే మనోజ్ మౌనిక దంపతులు చాలా గ్రేట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Manchu Manoj -Mounika:నిజంగా గ్రేట్ అంటూ…


ఇక మనోజ్ ఈ మధ్యకాలంలో ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలలో కూడా పాల్గొంటున్న విషయం మనకు తెలిసిందే. గత కొద్దిరోజుల క్రితం ఈయన తన పుట్టినరోజు వేడుకలను కూడా అనాధాశ్రమంలోనే జరుపుకున్నారు. అక్కడ పిల్లల సమక్షంలో కేక్ కట్ చేయడమే కాకుండా వారికి బుక్స్, బ్యాగ్ వంటి అవసరమైన వస్తువులను పంపిణీ చేసి మంచి మనసు చాటుకున్నారు.