తనను పోటీ నుంచి చిరంజీవి తప్పుకోమ్మన్నారు.. మంచు విష్ణు!

మూవీ ఆర్టిస్టు అసోషియేషన్ (మా) ఎన్నికలు ముగిశాయి. అధ్యక్షుడిగా మంచు విష్ణు గెలుపొందారు. అతడితో పాటు అతడి ప్యానెల్ సభ్యులు కూడా ఘన విజయం సాధించారు. మా ఎన్నికల ముందు ఎంతో రచ్చ జరిగింది. ఒకరిపై ఒకరు దూషణలు కూడా చేసుకున్నారు. ముగిసిన తర్వాత కూడా విభేదాలు తగ్గినట్లు కనిపించడం లేదు.

అందుకు ప్రకాష్ రాజ్, నాగబాబు, శివాజీ రాజా రాజీనామాలు చేశారు. అయితే మంచు విష్ణు ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే మీడియాతో ముచ్చ‌టించారు. అతడు అక్కడ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. అతడు అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న సమయంలో తనను ఎన్నికల నుంచి తప్పుకోమని చిరంజీవి చెప్పారని అన్నారు. ప్ర‌కాశ్‌రాజ్ పోటీలో ఉన్నాడు క‌దా, విష్ణుని పోటీ నుంచి త‌ప్పుకోమ‌ని చెప్పొచ్చు క‌దా అని మోహ‌న్ బాబుకు చిరంజీవి చెప్పార‌ని మంచు విష్ణు పేర్కొన్నారు.

కానీ ఎట్టి పరిస్థితిలో ఎన్నికలు జరగాల్సిందే అని నాన్న , తాను అనుకోవడం వల్లనే పోటీలో నిల్చున్నాన‌ని మంచువిష్ణు తెలిపారు. రామ్ చరణ్ అంటే తనకు చాలా ఇష్టం అని.. అతడు తనకు మంచి మిత్రుడు అని.. అతడు తనకు ఓటు వేయలేదనే విషయం తనకు తెలుసు అని చెప్పాడు.

చిరంజీవి మాట ఎప్పుడు రామ్ చరణ్ తప్పడు.. వాళ్ల నాన్న మాట అంటే అతడు అంతాలా పాటిస్తాడు.. అలాగే తాను కూడా నాన్న మాటను జవదాటను అంటూ చెప్పాడు. అందుకు నాన్న తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నాను అంటూ చెప్పుకొచ్చాడు. అయితే నాగబాబు రాజీనామాను తాను ఆమోదించనని.. ఆ రాజీనామాను ఉపసంహరించుకోవాలని అతడు కోరాడు. గెలుపోటములు సహజం అని.. ఆయన అన్నారు.