Meena : తన కూతురు కష్టపడకూడదని మీనా భర్త ఏం చేసారో తెలుసా…!

Meena : ఏ తండ్రి అయినా తమ బిడ్డల జీవితాలు బాగుండాలి అని నిరంతరం కష్టపడుతుంటారు. తమ కష్టం పిల్లలకు తెలియనివ్వకుండా వారి జీవిత భద్రత కోసం ఆలోచిస్తుంటారు. తాము ఉన్నా లేకపోయినా పిల్లలు ఆర్థిక ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు చేస్తుంటారు. ఇపుడు మీనా భర్త కూడా కూతురు నైనిక గురించి అలానే ఆలోచించారు.

విద్యాసాగర్ కూతురి కోసం ఇంత చేశారా…

మీనా భర్త హాటాత్తుగా మరణించి అందరినీ దిగ్బ్రాంతికి గురిచేసారు. కరోనా వచ్చిన తరువాత మీనా కుటుంబం మొత్తం కోలుకున్నా విద్యాసాగర్ గారికి ఊపిరి తిత్తుల ఇన్ఫెక్షన్ సోకింది. ఇక చికిత్సలో ఉన్నపుడు ఆ ఇన్ఫెక్షన్ ఎక్కువై ఊపిరి తిత్తులు పాడైపోయాయి. దీంతో డోనర్ అవసరం ఏర్పడి, మీనా లంగ్స్ డోనర్ కోసం అన్ని విధాలా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఊపిరి తిత్తులు పూర్తిగా పాడవడం వల్ల ఆయన మరణించారు. ఇక నైనిక పూర్తి బాధ్యత మీనా మీదే ఉంది. ఇక మీనా సినిమాలను కూడా పాపకోసం మానేస్తున్నట్లు వార్తలు కూడా వినిపించాయి.

ఇక విద్యాసాగర్ గారు కూడా తన కూతురు లైఫ్ లో ఆర్థికంగా ఏ మాత్రం ఇబ్బంది పడకూడదని ముందు చూపుతో అలోచించి కోట్ల విలువ చేసే ఆస్తులను పాప పేరిట చేశారట. ఇక మీనా కూడా కేవలం ఇప్పుడు ఒప్పుకున్న సినిమాలను చేసి ఆ తరువాత పూర్తిగా పాపను చూసుకోవాలని అనుకుంటున్నారట. తండ్రి లేని లోటు తెలియకుండా తన పాపను పెంచాలని అనుకుంటున్నట్లు సమాచారం.