Featured

Varun Tej: వరుణ్ తేజ్ అసలు పేరు ఇది కాదా.. ఆయన అసలు పేరు ఏంటో తెలుసా?

Published

on

Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ త్వరలోనే ఆపరేషన్ వాలంటైన్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా మార్చి 1వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న తరుణంలో వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ సినిమాని భారీ స్థాయిలో ప్రమోట్ చేస్తున్నారు వరుణ్ తేజ్.

ఇదిలా ఉండగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈయన తన గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈయన పేరు వరుణ్ తేజ్ గా మాత్రమే మనకు తెలుసు కానీ ఇతని పూర్తి పేరు ఇప్పటివరకు ఎక్కడ బయట పెట్టలేదు కానీ తాజాగా వరుణ్ తేజ్ పూర్తి పేరును ఈ సందర్భంగా బయటపెట్టారు.

ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత తన పేరు పెద్దగా ఉండడంతో వరుణ్ తేజ్ అని పెట్టుకున్నాను కానీ నా అసలు పేరు సాయి వరుణ్ తేజ్ అని ఈయన తెలియజేశారు. ఆధార్ కార్డు అలాగే పాస్పోర్ట్ వంటి వాటిలో తన పేరు సాయి వరుణ్ తేజ్ అనే ఉంటుందని ఇండస్ట్రీలోకి వచ్చిన తరువాతనే తాను వరుణ్ తేజ్ గా మార్చుకున్నానని తెలిపారు.

Advertisement

హైట్ ప్రాబ్లంగా మారింది..

ఇక ఈయన సినిమాల గురించి మాట్లాడుతూ తన హైట్ కి నా పక్కన హీరోయిన్స్ నటించడానికి చాలా ఇబ్బంది పడతారని అందుకే వాళ్ళ హైట్ కు అనుగుణంగా నటించడానికి నేను కాస్త ఇబ్బంది పడుతూనే ఉంటాను అంటూ ఈ సందర్భంగా వరుణ్ తెలిపారు.

Advertisement

Trending

Exit mobile version