Featured

Megastar Chiranjeevi : 1990 లో మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ మూడు చిత్రాలు బాక్సాఫీస్ ను బద్దలు కొట్టాయి!

Megastar Chiranjeevi : 1983 నుంచి మెగాస్టార్ చిరంజీవి వరుస హిట్లతో విజయ దుందుభి మోగించారు. ఆ క్రమంలో 1990 వచ్చేసరికి కొండవీటి దొంగ, జగదేకవీరుడు అతిలోకసుందరి, కొదమసింహం లాంటి చిత్రాలతో బాక్సాఫీసును బద్దలు కొట్టారు. “కొండవీటి దొంగ” 1990 లో ఎ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఒక విజయవంతమైన సినిమా. ఇందులో చిరంజీవి, విజయశాంతి, రాధ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాను శ్రీ విజయలక్ష్మి ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై టి. త్రివిక్రమరావు నిర్మించాడు. పరుచూరి సోదరులు కథ నందించగా, యండమూరి వీరేంద్రనాథ్ చిత్రానువాదం సమకూర్చారు.”

కొండవీడు అనే గిరిజన గ్రామంలో రాజా అనే పిల్లవాడి తల్లిదండ్రులను కొంతమంది రౌడీలు తరుముతూ వస్తుంటారు. వాళ్ళు రాజా తండ్రిని చంపేసి ఆ నేరాన్ని తల్లి మీద మోపి జైలుకు పంపుతారు. రాజాని మాత్రం గూడెం నాయకుడు కాపాడతాడు. రాజా పట్నం వెళ్ళి బాగా చదువుకుని వస్తాడు. ఇంతకాలం తర్వాత కూడా అక్కడి ప్రజలు మోసానికి గురవుతూ ఉండటం గమనిస్తాడు. ఆ మోసాలకు కారణమవుతున్న శరభోజి, కాద్రా, అతని బృందంపై ఎదురు తిరగాలనుకుంటాడు. కానీ తనను కాపాడిన గూడెం నాయకుడు మాత్రం కొండవీటి దొంగగా అవతారం ఎత్తమని సలహా ఇస్తాడు. అలా రాజా కొండవీటి దొంగ వేషంలో ధనవంతుల దగ్గర సొమ్ము దొంగిలించి పేదవాళ్ళకు పంచిపెడుతూ ఉంటాడు.

“జగదేకవీరుడు అతిలోకసుందరి” 1990 లో కె. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వచ్చిన ఒక సోషియో ఫాంటసీ చిత్రం. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ పతాకంపై సి. అశ్వనీదత్ నిర్మించాడు. రాఘవేంద్రరావు, జంధ్యాల కలిసి స్క్రీన్ ప్లే రాశారు. చిరంజీవి, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో అమ్రిష్ పురి, కన్నడ ప్రభాకర్, అల్లు రామలింగయ్య, రామిరెడ్డి సహాయ పాత్రల్లో నటించారు.ఇళయరాజా సంగీతం అందించాడు. ఈ కథలోకి వెళితే.. శ్రీ ఆంజనేయస్వామి భక్తుడైన రాజు (చిరంజీవి) ఒక గైడ్. అనాథ పిల్లలని నలుగురిని తనతో బాటు పెంచుకుంటూ ఉంటాడు. ఆ పిల్లలలో ఒక అమ్మాయికి ఒక ప్రమాదంలో కాలు విరిగిపోతుంది. హిమాలయాల్లో మాత్రమే లభ్యమయ్యే ఒక మూలికతో ఆ అమ్మాయిని మళ్ళీ నడిచేలా చేయవచ్చని ఒక స్వామి చెప్పటంతో రాజు హిమాలయాలకి బయలుదేరతాడు. ఆ మూలికను సంపాదించి తిరిగి వస్తుండగా, దారి తప్పి మానససరోవరానికి వస్తాడు. స్వర్గలోకాన ఇంద్రుని పుత్రిక అయిన ఇంద్రజ (శ్రీదేవి) భూలోకాన మానససరోవరం అందంగా ఉంటుందని తెలుసుకొని తండ్రి వద్ద అనుమతి తీసుకొని అక్కడకు వస్తుంది. తిరిగి వెళ్ళు సమయంలో స్వర్గలోక ప్రవేశం గావించే ఉంగరాన్ని జారవిడుచుకొంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందనేది మిగతా కథాంశం.

1990లో “కొదమ సింహం” కైకాల నాగేశ్వ‌ర్ రావు ఈ మూవీని నిర్మించ‌గా.. ద‌ర్శ‌కుడు ముర‌ళీ మోహ‌న్ రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇందులో రాధ‌, వాణీ విశ్వ‌నాథ్ లతోపాటు సోన‌మ్ అనే హిందీ న‌టి కూడా యాక్ట్ చేసింది. అలాగే కైకాల స‌త్య‌నారాయ‌ణ, మోహ‌న్‌బాబు, గొళ్ల‌పూడి, క‌న్న‌డ ప్ర‌భాక‌ర్‌, ప్రాణ్ (హిందీ) లు ఇందులో కీల‌క‌పాత్ర‌లు పోషించారు. ఇందులో హార్స్ రైడింగ్ కోసం చిరంజీవి అప్ప‌ట్లో రాజ‌స్థాన్‌లో గుర్ర‌పు స్వారీ నేర్చుకున్నారు. 1989 సెప్టెంబ‌ర్ 21న ప్రారంభ‌మైన షూటింగ్ సుదీర్ఘంగా సాగింది. ఈ మూవీలో మెగాస్టార్‌తో ప్ర‌భుదేవా స్టెప్పులేయించారు. రాజ్ కోటి సంగీతం అందించారు. ఈ క్ర‌మంలోనే మూవీలోని పిల్లో జాబిల్లో.., ఘుం ఘుమాయించు కొంచెం.., చ‌క్కిలి గింత‌ల రాగం.., జ‌పం జ‌పం కొంగ జ‌పం.. అనే పాట‌లు బంప‌ర్ హిట్ అయ్యాయి. ఎక్క‌డ చూసినా ఈ పాట‌ల‌నే వినేవారు. ఆ క్ర‌మంలో‌ ఈ మూవీ షూటింగ్‌ను ఎట్ట‌కేల‌కు పూర్తి చేశారు. 1990, జూలైలో ఆడియో విడుద‌ల కాగా పాట‌లు సూప‌ర్ హిట్ అయ్యాయి. 1990, ఆగ‌స్టు 9వ తేదీన మూవీ విడుద‌లైంది. పాటలు, ఫైట్లు అద్భుతంగా కుదిరాయి. అయితే 1990 సంవత్సరంలో మెగాస్టార్ చిరంజీవి వరుసగా ఈ మూడు సూపర్ డూపర్ హిట్ సినిమాలతో విజయ దుందుభి మోగించారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago