Megastar Chiranjeevi : ఇండస్ట్రీకి పెద్దగా నేను ఉండను.. ! చిరంజీవి సంచలన వ్యాఖ్యలు

మొన్నటి వరకు ఇండస్ట్రీ పెద్ద అంటే దాసరి నారాయణరావు.. అయన చనిపోయిన తరువాత తెలుగు సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కు అంటూ ఎవరూ లేరు. అయితే మెగాస్టార్ చిరంజీవి ఆ భాద్యతలు తీసుకోవాలని చాలా మంది కోరుకుంటున్నారు. ఈ నేపధ్యంలో ఇండస్ట్రీ పెద్దగా ఉండాలని కొందరు చేస్తున వ్యాఖ్యలపై మెగాస్టార్ చిరంజీవి స్పందిచారు.

తానూ సినిమా ఇండస్ట్రీకి పెద్దగా ఉండనని స్పష్టం చేసారు. ఆ పదవి తనకి వద్దని.. పంచాయితీలు చేయడం నాకు ఇష్టం లేదని, ఇండస్ట్రీకి పెద్ద అనిపించుకోవడం ఇష్టం లేదని ఈ సందర్బంగా చిరు తెలిపారు. అయితే అవసరానికి అండగా ఉంటానని, అంతేతప్ప అనవసరమైన విషయాల్లో తలదూర్చనని తేల్చి చెప్పారు. అయినా కూడా సినీ కార్మికులకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా సాయం అందించడంలో తానూ ఎప్పుడూ ముందుంటానని తెలిపారు మెగాస్టార్ చిరంజీవి.