Karate Kalyani: కరాటే కళ్యాణి పెద్దగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర లేని పేరు. ఈమధ్య వివాదాలతో కూడా ఫేమస్ అవుతోంది కరాటే కళ్యాణి. అనేక సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసింది కరాటే కళ్యాణి. గత సీజన్ లో బిగ్ బాస్ షోలో కూడా పాల్గొంది.
ఆ సమయంలో కూడా వివాదాలకు కేరాఫ్ గా మారింది. బిగ్ బాస్ టీవీ షో పై కూడా పలు సంచలన వ్యాఖ్యలు చేసింది. అయితే ఇటు సినిమాతో తన కెరీర్ నిర్మించుకుంటూనే.. రాజకీయంగా యాక్టివ్ గా ఉంటుంది కరాటే కళ్యాణి.
బీజేపీ పార్టీలో ప్రస్తుతం ఈమె కొనసాగుతోంది. అయితే గతంలో హిందూ దేవతలు, దేవుళ్లపై కొందరు అనుచిత వ్యాఖ్యలు చేసిన సమయంలో గట్టిగానే రియాక్ట్ అయింది కళ్యాణి. బీజేపీ పార్టీలో ఫైర్ బ్రాండ్ గా ఎదిగే ప్రయత్నం చేస్తోంది.
తాజాగా కరాటే కళ్యాణి మరో వివాదంలో కూడా ఇరుక్కుంది. ఓ కేసు విషయంలో తనను చంపాలని ప్రయత్నిస్తున్నారంటూ… పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన ప్రాణాలకు ముప్పు ఉందని, రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించింది. శనివారం బంజారా హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఓ హత్య కేసులో సాక్ష్యాలు తారు మారు చేసిన ఘటనలో ప్రముఖ స్వచ్ఛంద సంస్థ కోట్ల రూపాయల నిధులను దుర్వినియోగం చేసిందని.. ఆ విషయాలు బయటపెడుతున్న క్రమంలో నాపై కక్ష కట్టి హతమార్చాలని చూస్తున్నారంటూ ఫిర్యాదులో పేర్కొంది. కరాటే కళ్యాణి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు.. ఈ విషయంపై విచారణ చేస్తామని వెల్లడించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…