Bigg Boss: అయ్యో బిగ్ బాస్.. ఎంత పని చేశావ్.. వారిని విడదీశావ్.. సిరితో షన్ను ప్రేమ ప్రయాణం?
Bigg Boss: బిగ్ బాసోడా… ఎంత పనిచేశావు అని అనుకుంటున్నారు నెటిజెన్లు. ఎందుకో తెలుసా.. బిగ్ బాస్ పెట్టిన పెంట వల్ల ఇద్దరు జంటల బంధాలు తెగిపోయాయి. వాళ్లెవరో కాదు షన్ముఖ్ జశ్వంత్- దీప్తి సునయన, శ్రీహాన్- సిరిలు.
అయితే తాజాగా దీప్తి సునయన, షన్ముఖ్ కు బ్రేకప్ చెప్పెసింది. ఇన్ స్టా వేదికగా ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకుంది దీప్తి. అయితే ఈ నిర్ణయం వాళ్లిద్దరి ఫ్యాన్స్ కు మింగుడు పడటం లేదు. దాదాపు 5 ఏళ్లుగా రిలేషన్ లో ఉన్న వీళ్లిద్దరు విడిపోవడం చాలా మందికి నచ్చడం లేదు.
అయితే ఇదిలా ఉంటే బిగ్ బాస్ హౌజ్ లో సిరి- షన్ముఖ్ మధ్య రిలేషన్ ఏర్పడినట్లు అందరూ అనుకుంటున్నారు. ఇద్దరూ కూడా ఫ్రెండ్స్ అని చెప్పుకుంటూనే హద్దులు దాటేస్తూ.. కిస్సింగ్ లు, హగ్గింగులు ఇచ్చుకోవడాలు, ఒకే బెడ్ పై పడుకోవడం చూసి చాలా మంది ఇదేంటని అనుకున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారమే దీప్తి – షన్నూల మధ్య దూరాన్ని పెంచాయి. అయితే దీప్తి లాంటి వాళ్లకు ముందుగానే బిగ్ బాస్ అనుభవాలు ఉన్నాయి.
గేమ్ కోసం ఇద్దరిని బిగ్ బాస్ దగ్గర చేశాడని ముందుగా దీప్తి అనుకున్నప్పటికీ.. ఇటీవల బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత షన్నూ ప్రవర్తనలో కూడా మార్పు వచ్చినట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత షన్నూ దీప్తిని కలిసే ప్రయత్నం చేయలేదు. నేరుగా వైజాగ్ లో అతని సొంతింటికి వెళ్లిపోయాడని తెలుస్తోంది. అయితే కొన్ని రోజుల నుంచి వేయిట్ చేస్తున్న దీప్తి షన్నూతో విసిగిపోయి బ్రేకప్ ప్రకటించిందని అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే శ్రీహాన్- సిరిల మధ్య రిలేషన్ కూడా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరి కూడా బిగ్ బాస్ అనంతరం పెద్దగా కలిసింది లేదు. అయితే ఇటు దీప్తితో షన్నూ విడిపోవడం, అటు సిరితో శ్రీహాన్ దూరంగా ఉండటం చూస్తే.. ఇక షన్నూ- సిరికి మధ్య ఎవరూ అడ్డంకిగా లేరని నెటిజెన్లు అనుకుంటున్నారు
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…